నేర రహిత సమాజమే లక్ష్యం.. గచ్చిబౌలి భరోసా టీమ్

నేర రహిత సమాజమే లక్ష్యం.. గచ్చిబౌలి భరోసా టీమ్
  • రక్షణ చట్టాలపై కొనసాగుతున్న 
  • అవగాహన​ కార్యక్రమాలు 

గచ్చిబౌలి, వెలుగు: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గచ్చిబౌలి భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు కొనసాగతున్నాయి. శుక్రవారం నిర్వహించిన అవేర్​నెస్​క్యాంపులకు లీగల్ కౌన్సిలర్లు పవిత్ర, అంజలి, కౌన్సిలర్ హేమ కెరెన్ పాల్ నేతృత్వం వహించారు. గచ్చిబౌలి విలేజ్​లో 38 మంది స్థానిక నాయకులకు డిజిటల్​అరెస్టులు, సైబర్​క్రైమ్స్​పై అవగాహన కల్పించారు. 

రాయదుర్గంలో 62 మంది కమ్యూనిటీ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్లకు పని ప్రదేశాల్లోమహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం, హనీ ట్రాపింగ్, భరోసా గురించి వివరించారు. లింగంపల్లిలో సెల్ఫ్​హెల్ప్​గ్రూపు మహిళలకు పోక్సో, గృహహింస, మహిళా హక్కులు ఇతర విషయాలపై అవగాహన కల్పించారు. సమాజంలోని వివిధ వర్గాలను చైతన్యపరచడం ద్వారా నేరరహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు.