తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు బంగారం రేటు తగ్గినప్పుడు కొనాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా కొనసాగుతున్న గందరగోళ పరిస్థితులు బులియన్ మార్కెట్లను ముందుకు వెళ్లకుండా నిరోధిస్తున్నాయి. ఈ క్రమంలో కొత్త నెల ప్రారంభంలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ ప్రాంతంలో ఉన్న తాజా రిటైల్ విక్రయ ధరలను పరిశీలించి నిర్ణయం తీసుకోవటం బెటర్.
మే 1న బంగారం రేట్లు తగ్గాయి. ఏప్రిల్ 30 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.38 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 235గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.13వేల 965గా కొనసాగుతోంది.
శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 1, 2026న దేశవ్యాప్తంగా రేటు కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 65వేల వద్ద ఉంది. అంటే గ్రాము ధర రూ.265గా అమ్మకాలు జరుగుతున్నాయి.
