హేమలత లవణం గా రేణు దేశాయ్.. టైగర్ నాగేశ్వరరావు లుక్ వైరల్

హేమలత లవణం గా రేణు దేశాయ్.. టైగర్ నాగేశ్వరరావు లుక్ వైరల్

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నుండి వస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా  మూవీ టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao). స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు వంశీ(Vamssee) తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ నురూప్ సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన పోస్టర్స్ అండ్ వీడియోస్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఏ సినిమా నటి రేణు దేశాయ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ సినిమా నుండి ఆమె లుక్ రివీల్ చేశారు మేకర్స్. ఇందులో రేణు దేశాయ్ హేమలత లవణం అనే పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో రేణు తెల్ల చీర కట్టుకొని, ఒళ్ళో బాబుని ఎత్తుకొని కనిపించారు. ఈ పోస్టర్ ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. చాలా కాలం తరువాత రేణు దేశాయ్ తెరపై కనిపిస్తుండటంతో ఆమె ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి ఈ సినిమాతో ఆమె స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారో చూడాలి.