నటి రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటారు. సినిమా, సామాజిక అంశాలపై ఆమె చేసే పోస్ట్ లు వైరల్ అవుతుంటాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో విడాకుల తర్వాత చాలా కాలం పాటు పిల్లల బాధ్యతలతో ఇంటికే పరిమితమైన ఆమె..సెకండ్ ఇన్నింగ్స్‌లో రూట్ మార్చారు. వరుస సినిమాలు, క్రేజీ వెబ్ సిరీస్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో ఫుల్ బిజీ అయిపోయారు. ఒకవైపు నటిగా రాణిస్తూనే.. మరోవైపు మూగజీవాల సంరక్షణ కోసం ఎన్జీవో రన్ చేస్తున్నారు . అయితే లేటెస్ట్ గా రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
మెగాస్టార్‌తో డ్రీమ్ మీట్!
ఎప్పుడూ కూల్‌గా ఉండే రేణు దేశాయ్.. లేటెస్ట్ గా ఒకరిని చూసి పసిపిల్లలా మురిసిపోయారు. ఆయనే మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి.. ఎప్పటి నుంచో మమ్ముట్టిని కలవాలనేది రేణు దేశాయ్ బిగ్గెస్ట్ డ్రీమ్. తాజాగా ఆమె కోరిక నెరవేరింది. ఒక క్యారవాన్‌లో మమ్ముట్టిని కలిసిన రేణు.. ఆ క్షణాలను లైఫ్‌టైమ్ మెమరీగా మార్చుకున్నారు. తన అభిమానాన్ని పంచుకున్నారు.
ఎమోషనల్ పోస్ట్!
ఆయనతో దిగిన క్రేజీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రేణు దేశాయ్ తన ఆనందాన్ని తట్టుకోలేకపోయారు. ఇది నాకు పక్కా పిచ్చెక్కిపోయే ఫ్యాన్ గర్ల్ మూమెంట్.. మమ్ముట్టి సార్‌ను కలవడం, ఆయనతో కాసేపు మాట్లాడటం నా లైఫ్ బకెట్ లిస్ట్‌లో ఒకటి. అది ఇప్పటికి నిజమైంది. ఒక వీరాభిమానిగా నా మనసు, ఆత్మ సంతోషంతో ఉప్పొంగిపోతున్నాయి. నేను ఇప్పటివరకు కలిసిన వారిలో ఆయన అత్యంత ప్రతిభావంతుడు, వినయశీలి, తెలివైనవాడు, దయగల వ్యక్తి" అంటూ ఎమోషనల్ క్యాప్షన్ పెట్టారు.
నెట్టింట వైరల్!
ఈ ఫొటోలో రేణు దేశాయ్ ముఖంలో కనిపిస్తున్న ఎక్సైట్‌మెంట్ చూస్తే ఆమె ఎంత పెద్ద అభిమానో అర్థమవుతోంది. డెబ్బై ఏళ్ళు దాటినా కుర్ర హీరోలకు పోటీనిచ్చేలా ఉన్న మమ్ముట్టి గ్లామర్, పక్కనే మురిసిపోతున్న రేణు దేశాయ్ లుక్స్ ఈ పిక్‌ను ఇన్‌స్టంట్‌గా వైరల్ గా మారాయి. సెలబ్రిటీలు కూడా సామాన్యులలాగే స్టార్స్‌ని చూసి మురిసిపోతారని ఈ ఫోటో నిరూపించిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్, మాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ క్రేజీ పిక్స్ తెగ షేర్ అవుతోంది.
