రీ పోస్టుమార్టం.. ఒక్కో బాడీకి 2 గంటలు

రీ పోస్టుమార్టం.. ఒక్కో బాడీకి 2 గంటలు

దిశ నిందితుల డెడ్ బాడీలకు ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల టీం రీ పోస్టుమార్టం చేయనుంది. ఇందుకోసం ఎయిమ్స్ డాక్టర్లు నిన్న రాత్రే హైదరాబాద్ చేరుకున్నారు. దిశ నిందితులు నలుగురి మృతదేహాలకు రీ పోస్టుమార్టం మొదలుకానుంది. ఈ రీపోస్టుమార్టం సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకుంటే ఒక్కో డెడ్‌బాడీకి రీ పోస్టుమార్టం చేసేందుకు రెండు గంటల సమయం పట్టే అవకాశముందని గాంధీ హాస్పిటల్ అధికారులు అంటున్నారు.

ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్తా ఆధ్వర్యంలోని టీమ్…రీ పోస్టుమార్టంలో పాల్గొంటుంది. డాక్టర్ ఆదర్శ్ కుమార్, డాక్టర్ అభిషేక్ యాదవ్, డాక్టర్ వరుణ చంద్ర టీమ్‌లో సభ్యులుగా ఉన్నారు. రీ పోస్టుమార్టం మొత్తాన్నీ వీడియో తీసి, కలెక్షన్స్ ఆఫ్ ఎవిడెన్స్‌ను డాక్టర్లు సీల్డ్ కవర్‌లో భద్రపరుస్తారు. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం సాయంత్రం 5 గంటలలోగా రీ పోస్టుమార్టం పూర్తి చేసి ఆ రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించే అవకాశం ఉంది.

రీపోస్టుమార్టం మొత్తాన్ని వీడియో తీయాలని, వీడియో ఫుటేజీతో పాటు.. పోస్టుమార్టం రిపోర్టును హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాలను.. గాంధీ సూపరింటెండెంట్, పోలీసుల సమక్షంలో వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని సూచించింది. దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన అన్ని రిపోర్టులను సీజ్ చేసి, సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపాలని ప్రభుత్వం నియమించిన సిట్ బృందాన్ని కోర్టు ఆదేశించింది.

For More News..

రూ. 8 కోట్ల కుక్క దొంగతనం.. పట్టిస్తే లక్ష..

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఢిల్లీ వైద్యుల బృందం..
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మోహరించిన పోలీసులు
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఢిల్లీ వైద్యుల బృందం..
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్న ఢిల్లీ వైద్యుల బృందం..