ఈ రాళ్లను పేర్చిందెవరు? 

ఈ రాళ్లను పేర్చిందెవరు? 

చల్లని సముద్రానికి ఎదురుగా.. నల్లని కొండలు.. ఆ కొండల అంచున సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందని అందాలు. వాటి చుట్టూ అనేక పురాణాలు, మిస్టరీలు. ఆ రాళ్ల అసలు కథను తెలుసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరుగుతున్నాయి. కానీ.. కచ్చితమైన కారణమేంటో ఇప్పటికీ తెలియలేదు. అందుకే దీన్ని వరల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనడంలో ఆశ్చర్యం లేదు. అసలు ఈ జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే ఎలా? ఎప్పుడు? ఏర్పడిందనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందో... లేదో!  

జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే.. ఒక జాగ్రఫిక్ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. ఇది వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రమే కాదు మిస్టరీ కూడా. మొత్తం 40,000 రాళ్లు ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఉన్నాయి ఇక్కడ. అవన్నీ ఒక అగ్ని పర్వతం పేలి ఏర్పడిన బసాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాళ్లని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అంచనా వేస్తున్నారు. ఇది ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఉత్తర తీరంలో ఉన్న కౌంటీ ఆంట్రిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంది. బుష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిల్స్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఈశాన్యంగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. ఈ రాళ్ల వల్ల పెద్ద టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇక్కడికి రోజూ టూరిస్టులు, ట్రావెలర్స్ వస్తుంటారు. పెద్ద కొండకు ఆనుకుని ఉన్న స్తంభాలు సముద్రం వైపు వెళ్లే కొద్దీ ఎత్తు తగ్గుతాయి. చివరగా సముద్రంలో మాయమైనట్టు అనిపిస్తాయి. ఇందులో చాలా రాళ్లకు ఆరు ఫేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఉన్నాయి. మరి కొన్నింటికి నాలుగు, ఐదు, ఏడు, ఎనిమిది కూడా ఉన్నాయి. ఎక్కువ రాళ్లు దాదాపు 12 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్నాయి. అయితే.. ఈ రాళ్ల పుట్టుకకు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 
 

ఫిన్ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూల్

ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఒకప్పుడు ఫిన్ మెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కూల్(ఫియోన్ మాక్ కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హైల్ అని కూడా పిలుస్తారు) అనే గొప్ప జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(అసాధారణ శక్తులున్న బలమైన వ్యక్తి) ఉండేవాడు. అతను స్కాట్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మరో జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని జయించాలనుకున్నాడు. బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తక్కువ తెలివితేటలు ఉన్నప్పటికీ చాలా బలవంతుడు. ఆ విషయం తెలిసినా ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతన్ని ఓడించాలని నిర్ణయించుకుంటాడు. అతని దగ్గరికి వెళ్లాలంటే సముద్రం దాటాలి. అందుకోసం దగ్గర్లోని పెద్ద పెద్ద రాళ్లను చీల్చి సముద్రంలోకి నెట్టి ఒక దారిని నిర్మించాడు. అదే జెయింట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే. దీన్ని కట్టేందుకు చాలామంది రాత్రనక, పగలనక పనిచేశారు. రోడ్డు వేయడం పూర్తైన తర్వాత అవతలి వైపు వెళ్లి చూసి అతను ఊహించిన దానికంటే బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలా బలవంతుడని తెలుసుకుంటాడు. అతన్ని జయించడం సాధ్యం కాదని, ప్రయత్నం మానుకుని ఇంటికి వెళ్లిపోతాడు. కానీ.. కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే నిర్మించారని తెలుసుకున్న బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాని మీదుగా ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వస్తాడు. ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చేరుకోగానే ఫిన్ కోసం వెతకడం మొదలుపెడతాడు. ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే గొప్ప యోధుడు. అతన్ని ఓడిస్తే ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఓడించినట్టే. కానీ.. ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతనితో యుద్ధం చేసి గెలవలేడు. అక్కడి నుంచి పారిపోయేంత టైం కూడా అతనికి లేదు. దాంతో ఒక మంచి ఉపాయం పన్నుతాడు. అతని భార్య ఊనాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి తనను చిన్న పిల్లాడిలా రెడీ చేయమని చెప్తాడు. ఇంతలోనే  బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అతని ఇంటికి వస్తాడు. అప్పుడు అతని భార్య బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘‘ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇక్కడ లేడు. నా బిడ్డ, నేను మాత్రమే ఇంట్లో ఉన్నాం”అని తన బిడ్డ అని ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని చూపిస్తుంది. ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉయ్యాలలో ఉంటాడు. అతన్ని చూసిన బెనాండొనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘‘ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొడుకు ఇంత చిన్న వయసులోనే ఇంత బలంగా ఉన్నాడంటే.. ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంకెంత బలవంతుడో” అని భయపడతాడు. ఫిన్ కంటపడకుండా స్కాట్లాండ్ పారిపోవాలని నిర్ణయించుకుని పరుగు మొదలుపెడతాడు. అదే టైంలో అతన్ని ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెంబడిస్తాడేమోననే భయంతో కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేని ధ్వంసం చేస్తూ వెళ్తాడు. అందుకే కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేలోని కొన్ని రాళ్లు విరిగిపోయి ఉన్నాయని అక్కడి ప్రజలు కథలుగా చెప్పుకుంటారు.  
 

సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏం చెప్తుంది? 

50 నుంచి 60 మిలియన్ సంవత్సరాల క్రితం ఆంట్రిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అనే అగ్నిపర్వతం బద్ధలై లావా బయటికొచ్చింది. ఆ లావా తీవ్రమైన వోల్కానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్టివిటీ వల్ల ఈ రాళ్లు ఏర్పడి ఉండొచ్చని సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అంచనా వేస్తున్నారు. లావా నీళ్లలో పడి తొందరగా చల్లబడడంతో బసాల్ట్ రాళ్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత నిలువుగా పగుళ్లు ఏర్పడి పిల్లర్లలా విడిపోయాయి. అయితే.. పిల్లర్ల వెడల్పు, ఎత్తుల్లో లావా చల్లబడే టైంని బట్టి మారుతుంటాయి. ఇలాంటి వాటిని ‘‘బాల్, సాకెట్”జెయింట్స్ అంటారు. కానీ.. ఈ థియరీని కూడా చాలామంది సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఒప్పుకోవడంలేదు. 
 

ఎరుపు బసాల్టిక్ ప్రిజమ్స్

డబ్లిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ట్రినిటీ కాలేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసే సర్ రిచర్డ్ బుల్కెలీ 1692లో మొదటగా ఈ రాళ్ల గురించి రాయల్ సొసైటీకి చెప్పాడు. 1963లో ఈ కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వే గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. 1739లో డబ్లిన్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘సుసేన్​ డ్రూరీ’ వీటికి వాటర్ కలర్ పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయడంతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసింది. అయితే.. మొదటి సారిగా 1768లో ఫ్రెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జియాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నికోలస్ డెస్మరెస్ట్ వీటి గురించిన సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ థియరీ చెప్పాడు. ఇలాంటి నిర్మాణాలు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడే అవకాశముందని అన్నాడాయన.19వ శతాబ్దంలోకి అడుగుపెట్టేసరికి ఇది టూరిస్ట్ స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. 
 

అనేక ఆకారాలు

ఈ ప్రాంతంలోని కొన్ని రాళ్లు పిల్లర్లలా కాకుండా వేరే ఆకారాల్లో కూడా ఉన్నాయి. సముద్రపు అలల తాకిడి వల్ల ఇలా అనేక రూపాల్లో ఏర్పడి ఉండొచ్చు. వాటిలో ఒకటి పెద్ద బూట్ ఆకారంలో ఉంది. దీని గురించి పురాణాల్లో కూడా ఉంది. ఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నీళ్లలో నడిచేటప్పుడు కాళ్లు తడవకుండా ఈ బూటు వేసుకునేవాడని ఇక్కడివాళ్లు చెప్తుంటారు. జెయింట్ ఐస్ అని పిలిచే ఎర్రని రాళ్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు కొన్ని రాళ్లు షెపర్డ్స్ స్టెప్స్, హనీకోంబ్, జెయింట్ హార్ప్, చిమ్నీ స్టాక్స్, జెయింట్ గేట్, ఒంటె లాంటి ఆకారాలను పోలి ఉన్నాయి. 
 

సముద్ర పక్షులు 

ఈ ప్రాంతాన్ని సముద్ర పక్షుల స్వర్గంగా పిలుస్తుంటారు. ఫల్మర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెట్రెల్, కార్మోరాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, రాజోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి అనేక పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఈ రాళ్ల సందుల్లో అనేక రకాల సముద్రపు మొక్కలు ఉన్నాయి కూడా. సీ స్ప్లీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ట్రిఫోలియమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్వెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్క్విల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీ ఫెస్క్యూ, ఫ్రాగ్ ఆర్కిడ్ లాంటి మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి. 


షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రమాదాలు 


ఈ అందమైన రాళ్లకు మరోవైపు చీకటి కోణం కూడా ఉంది. ఈ ప్రాంతం షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాక్సిడెంట్లకు కేరాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారింది. ఇక్కడ చాలా నౌకలు మునిగిపోయాయి. ఎందుకంటే సముద్రంలో ఉన్న కొన్ని రాళ్లు బయటికి కనిపించవు. అవి షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తాకడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి.1588లో గిరోనా అని పిలిచే స్పానిష్ ఓడ తుపాను వల్ల కొట్టుకొచ్చి ఈ రాళ్లను తాకింది. దాంతో చాలా నష్టం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రమాదాల వల్ల దొరికిన బంగారం, వెండి ఇతర విలువైన వస్తువులను బెల్​ ఫాస్ట్ ఉల్స్టర్ మ్యూజియంలో చూడొచ్చు. 

యునెస్కో గుర్తింపు 


దీన్ని 1986లో ‘వరల్డ్ హెరిటేజ్ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా యునెస్కో గుర్తించింది. 1987లో ఉత్తర ఐర్లాండ్ పర్యావరణ శాఖ దీన్ని ‘నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా గుర్తించింది. అంతేకాదు ‘యునైటెడ్ కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జెయింట్ కాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేని నాలుగో న్యాచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పిలుస్తుంటారు. దీని కాపాడే బాధ్యతను ‘నేషనల్ ట్రస్ట్’ తీసుకుంది. ఇది ఉత్తర ఐర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అట్రాక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. అందుకే చాలామంది టూరిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వస్తుంటారు. 2019లో 9,98,000 మంది టూరిస్టులు వచ్చారు. ఆ తర్వాత కరోనా వల్ల ఆ సంఖ్య కాస్త తగ్గింది.                                                                                                        ::: కరుణాకర్​ మానెగాళ్ల