కూకట్పల్లి, వెలుగు: కూకట్‌పల్లిలో ఓ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి బిల్డింగ్‌పై నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. కాశ్మీర్‌కు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పుష్పకుమార్ (66) తన కుటుంబంతో కలిసి కూకట్పల్లి మూసాపేట పరిధిలోని మెరీనా అపార్ట్మెంట్లోని 1502 ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. గత ఆరేండ్లుగా బ్రెయిన్ నర్వ్ (మెదడు నరాల) సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.55 గంటల సమయంలో తాను ఉంటున్న 15వ అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆరోగ్య సమస్యల కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
