హైదరాబాద్ కూకట్ పల్లిలో విషాదం చోటు చేసుకుంది.అపార్ట్మెంట్ 15వ ఫ్లోర్ నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి. ఆదివారం ( మే 17 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
కూకట్ పల్లి మెరీనా స్కైస్ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నాడు 66 ఏళ్ళ రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి పుషప్ కుమార్. ఏం కష్టం వచ్చిందో ఏమో కానీ.. అపార్ట్మెంట్ 15వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పుషప్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
