కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్  నియమితులయ్యారు.  1985 బ్యాచ్ పంజాబ్ క్యాడర్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్ ను నియమిస్తూ  కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

ఎన్నికల సంఘంలో ప్రధాన కమిషనర్ తో పాటు  ఇద్దరు కమిషనర్లు ఉంటారు.  ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు.  మరో  కమిషనర్ గా అనూప్ చంద్ర పాండే ఉన్నారు. సుశీల్ చంద్ర పదవి విరమణతో రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో  దాదాపు ఆరు నెలలుగా కమిషనర్ పోస్ట్ ఖాళీగా ఉంది.  దీంతో  కమిషనర్ గా అరుణ్ గోయల్ ను నియమించారు.