- ఈ నెల 11న గ్లోబల్ కేటగిరీ అడ్మిషన్లు
నిర్మల్, వెలుగు: నిర్మల్‌జిల్లా బాసరతోపాటు మహబూబ్‌నగర్‌లోని ట్రిపుల్ఐటీ క్యాంపస్‌ల్లో ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసం నిర్వహించిన మొదటి విడత ప్రక్రియ సోమవారం ముగిసింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల కోసం నిర్వహించిన ఈ అడ్మిషన్ల ప్రక్రియలో పదో తరగతి పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేశారు.
యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ గోవర్ధన్ ఆధ్వర్యంలో ఈ అడ్మిషన్ల ప్రక్రియను నిర్వహించారు. విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన అనంతరం సీట్లను ఖరారు చేశారు. ఈనెల 11న గ్లోబల్ కేటగిరీ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు గోవర్ధన్ తెలిపారు.
దీనికి సంబంధించిన వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని తెలిపారు. మరో 10 రోజుల్లో రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలవుతుందని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో వివరాలను తెలుసుకోవాలన్నారు.
