కేర్ హాస్పిటల్​లో రోబో సాయంతో మోకాలి మార్పిడి సర్జరీ

కేర్ హాస్పిటల్​లో రోబో సాయంతో మోకాలి మార్పిడి సర్జరీ

హైదరాబాద్, వెలుగు:  గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్​లో  మొదటిసారిగా రోబో సాయంతో ఓ పేషెంట్​కు మోకాలి మార్పిడి సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. మోకాలి మార్పిడి సర్జరీలకు లేటెస్ట్ టెక్నాలజీతో  జాన్సన్ అండ్ జాన్సన్  వారి వేలిస్ రోబో అందుబాటులో ఉంటుందని ఆర్థొపెడిక్ డిపార్ట్​మెంట్ హెచ్​వోడీ, జాయింట్ రీప్లేస్​మెంట్ సర్జన్ డాక్టర్ రత్నాకర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వేలిస్ రోబో’ తో మోకాలి మార్పిడి వల్ల కలిగే ప్రయోజానాల గురించి ఆయన వివరించారు.

రోబో సాయంతో చేసే మోకాలి మార్పిడితో కచ్చితమైన కొలతలతో  ఇంప్లాంట్స్ ని సరిగా అమర్చవచ్చని,  దీని వల్ల మోకాలి మార్పిడి తర్వాత కూడా నడిచేటప్పుడు తక్కువ నొప్పితో పాటు తొందరగా కోలుకోవచ్చన్నారు. మారిన లైఫ్ స్టైల్, హెల్త్ పై జనాలకు అవగాహన పెరగడం వల్ల చిన్న వయసులోనే మోకాలి మార్పిడి సర్జరీ అవసరం పెరుగుతోందన్నారు. మోకాలి మార్పిడి తర్వాత  20 ఏండ్ల పాటు పేషెంట్​కు ఎలాంటి ఇబ్బంది ఉండదని డాక్టర్ రత్నాకర్ రావు చెప్పారు.