ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పిళ్ళైకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో పిళ్ళైకు నిరాశ.. బెయిల్ పిటిషన్ తిరస్కరణ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరుణ్ రామచంద్ర పిళ్ళై బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం, మనీ ల్యాండరింగ్ కేసులో మార్చి 6వ తేదీన పిళ్ళై అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాను కవిత ప్రతినిధిని కాదని, లిక్కర్ పాలసీ రూపకల్పనతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ముడుపుల వ్యవహారాలు సహా పెట్టుబడుల అంశాలపై రౌస్ అవెన్యూ కోర్టు పిళ్ళై వాదనలను పరిగణలోకి తీసుకోలేదు.

పిళ్లై బెయిల్ పిటిషన్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యతిరేకించింది. లిక్కర్ పాలసీ ద్వారా స్కామ్ జరిగిందని, అరుణ్ పిళ్ళై సౌత్ గ్రూప్ లో కీలక వ్యక్తి అని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో అరుణ్ పిళ్ళై కీలక పాత్ర పోషించారని, ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా అరుణ్ పిళ్ళై వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అరుణ్ పిళ్ళై, బుచ్చిబాబు లిక్కర్ వ్యాపారంలో లాభాలతో భూములు కొన్నారని తెలిపింది. ఈడీ వాదనలను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణలోకి తీసుకుంది.