సంజయ్ కొడుకు కనిపిస్తే..100 కు కాల్ చెయ్యండి..భగీరథ్ ను సీఎం రేవంత్ రక్షిస్తుండు: ఆర్ఎస్ ప్రవీణ్ 

సంజయ్ కొడుకు కనిపిస్తే..100 కు కాల్ చెయ్యండి..భగీరథ్ ను సీఎం రేవంత్ రక్షిస్తుండు: ఆర్ఎస్ ప్రవీణ్ 

హైదరాబాద్, వెలుగు: బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కనిపిస్తే 100కు ఫోన్ చేసి చెప్పాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సంజయ్ కుమారుడిని రక్షించేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు.  రితురాజ్ సిట్ అధికారిగా వచ్చిన తర్వాతే కేసులో కొంత పురోగతి వచ్చిందన్నారు. గురువారం ఆయన తెలంగాణభవన్ లో మీడియాతో మాట్లాడారు.

ఈ కేసులో అమ్మాయి వ్యక్తిత్వాన్ని, అమ్మాయి కుటుంబ వ్యక్తిత్వాన్ని దెబ్బ తీయాలని అడుగడుగునా కుట్రలు చేస్తున్నారని ప్రవీణ్ తెలిపారు. “ సీఎం రేవంత్ రెడ్డి మీరు కూడా ఒక తండ్రి. మీకు కూడా ఒక కూతురు, సోదరి ఉంటారు. సీతక్క.. మీరు కూడా ఒక మహిళ. కొండా సురేఖకు ఒక అమ్మాయి ఉన్నారు. మైనర్ బాలికపై వస్తున్న వీడియోలను వెంటనే ఆపించండి.

పాలిటిక్స్ లో లేని అబ్బాయి గురించి ఎందుకు మాట్లాడుతున్నరని కవిత అంటున్నరు. కానీ కరీంనగర్ లో ఎవరిని అడిగినా చెబుతారు.. బండి సంజయ్ ని కలవాలంటే ముందు భగీరథ్ ను కలవాలట. బీజేపీ చరిత్రనే పోక్సో చరిత్ర. పోక్సో కేసుల్లో ఇప్పటి వరకు బీజేపీ నేతలే ఎక్కువ మంది నిందితులున్నారు. దేశంలో 100 పోక్సో కేసులు వస్తే అందులో 44 బీజేపీ నేతలవే” అని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.