కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు

కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వల్లే ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలు

ప్రభుత్వం మొండి వైఖరి తో ముందుకు పోతుందని ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డి మండిపడ్డారు.  నోటీస్ ఇచ్చిన కూడా తమతో ఎవరు చర్చలు జరపలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ కు ప్రజా సమస్యల మీద ఆలోచన లేదని అన్నారు. సమ్మె కంటే ముందు మాట్లాడి ఉంటే సమస్యలు పరిష్కారం అయ్యేవని,  ఆర్టీసీ సమ్మె పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల కార్మికులు చనిపోయారని  వ్యాఖ్యానించారు.  ప్రైవేట్ బస్ ల కంటే ఆర్టీసీ బస్ లు లాభాలలో నడుస్తున్నాయన్న రాజిరెడ్డి…హైదరాబాద్, పల్లె వెలుగు బస్ లు మాత్రమే నష్టాలలో ఉన్నాయని తెలిపారు. మిగతా బస్ లు లాభాలలో నడుస్తున్నాయన్నారు. ఆర్టీసీ పరిరక్షణ కోసమే ఆర్టీసీ జేఏసీ ఈయూ, టీఎంయూ యూనియన్లతో జతకట్టినట్లు తెలిపారు. ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తే యూనియన్ లను వదిలివేస్తామని చెప్పారు.  దసరా పండుగ జరుపుకోలే కనీసం ..దీపావళి పండుగ జరుపుకునే లా చర్చలు సఫలం చేయాలని రాజిరెడ్డి కోరారు.