Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం

Devon Thomas: మ్యాచ్ ఫిక్సింగ్.. వెస్టిండీస్ క్రికెటర్‌పై ఐదేళ్ల నిషేధం

వెస్టిండీస్ ప్లేయర్ డేవన్ థామస్ చిక్కుల్లో పడ్డాడు. అవినీతి నిరోధక నిబంధనలు ఉల్లంఘించినందుకు అతడికి ఐసీసీ 5 ఏళ్లు నిషేధం  విధించింది. దీని ప్రకారం ఈ మాజీ విండీస్ ఓపెనర్ 5 ఏళ్ళ పాటు అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ప్రపంచంలో ఎలాంటి లీగ్ ల్లో ఆడకూడదు. శ్రీలంక ప్రీమియర్ లీగ్ తో పాటు కరీబియన్ ప్రీమియర్ లీగ్, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డ్ నిబంధనలు థామస్ ఉల్లంఘించాడని  ఐసీసీ స్పష్టం చేసింది.

 2021 శ్రీలంక ప్రీమియర్ లీగ్ లో థామస్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు తేలింది. దీంతో ఐసీసీ అప్పట్లోనే అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. తాజా విచారణలో థామస్ కూడా తన తప్పిదాన్ని అంగీకరించడంతో అతడిపై 5 ఏళ్లు నిషేధం విధించింది. 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన థామస్.. ఒక టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడి 31 పరుగులు చేశాడు. 21 వన్డేల్లో 238, 12 టీ20 మ్యాచ్ ల్లో 51 పరుగులు చేశాడు. థామస్ 2022లో చివరిసారిగా  ఆస్ట్రేలియాతో చివరి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాడు.