ఆర్టీసీ స్ట్రైక్ అప్డేట్: ఎల్లుండి నిరవధిక నిరాహార దీక్ష

ఆర్టీసీ స్ట్రైక్ అప్డేట్: ఎల్లుండి నిరవధిక నిరాహార దీక్ష

రేపు మంత్రులు,ఎమ్మెల్యేల ఇంటి ముందు నిరసనలకు పిలుపునిచ్చారు ఆర్టీసీ జేఏసీ నేతలు. కార్మికులపై దాడి జరిగినా… ప్రజా ప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడం దారుణమన్నారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు జేఏసీ నేతలు. ఎల్లుండి కన్వీనర్లంతా కలిసి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరపాలని కోరారు.