కరుడుగట్టిన నేరస్తుడు, గ్యాంగ్ స్టర్ నయీమ్ కేసులో RTI సంచలన వివరాలు బయటపెట్టింది. ఈ కేసులో ఎవరెవరి ప్రమేయం ఉందో తెలపాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ .. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐకి గతంలో అప్లై చేసింది. దీనిపై RTI సమాధానం ఇచ్చింది. నయీం కేసుతో 16 మంది టీఆర్ఎస్ లీడర్లు, 17 మంది పోలీసులకు సంబంధమున్నట్టు ఆర్టీఐ తెలిపింది.
మాజీ ఎమ్మెల్సే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సహా కొందరు మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ లకు ఈ కేసుతో సంబంధం ఉందని ఆర్టీఐ తెలిపింది. డీఎస్పీలు శ్రీనివాస్, సాయిమనోహర్ రావు, శ్రీనివాసరావు, ప్రకాష్ రావు, వెంకటనర్సయ్య సహా ఇన్స్ పెక్టర్లు మస్తాన్, శ్రీనివాస రావు, మాజీద్, వెంకట్ రెడ్డి, వెంకట సూర్యప్రకాష్, రవికిరణ్ రెడ్డి, బల్వంతయ్య, బాలయ్య, రవీందర్, నరేందర్ గౌడ్ , దినేష్ సాధిఖ్ మియా పేర్లను ఆర్టీఐ బయటపెట్టింది.
టీఆర్ఎస్ పార్టీకి చెందిన 16 మంది నాయకుల పేర్లు కూడా ఆర్టీఐ తెలిపిన కేసు వివరాల్లో ఉన్నాయి. భువనగిరి కౌన్సిలర్ అబ్దుల్ నాజర్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సుధాకర్, మాడీ ఎంపీపీలు నాగరాజు, వెంకటేష్ పేర్లు లిస్టులో ఉన్నాయి. మాజీ సర్పంచ్ పింగల్ రెడ్డి, మాడీ ఎంపీటీసీ సంజీవ సహా వెల్దండ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఈశ్వరయ్యకు నయీం కేసుతో సంబంధమున్నట్లు తెలిపింది RTI.
