వామ్మో ఇంత అసహనం.. ఇంత క్రూరత్వమా ! బాలుడి రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టిన ఆటో డ్రైవర్

వామ్మో ఇంత అసహనం.. ఇంత క్రూరత్వమా ! బాలుడి రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టిన ఆటో డ్రైవర్

మనుషుల్లో రాక్షసత్వం పెరిగి పోతుండటం చూస్తూనే ఉన్నాం. కానీ మనుషులే రాక్షసులైతే ఎంత క్రూరంగా, ఘోరంగా ఉంటారో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది. అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడి రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టాడు ఓ కిరాతకుడు. తండ్రిపై కోపంతో.. స్వేచ్ఛగా ఆడుకుంటున్న పిల్లోణ్ని బండకేసి కొట్టినట్లుగా.. రోడ్డుపైన గిరగిరా తిప్పి దారుణమైన ఘటనకు పాల్పడ్డాడు. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చదవాలంటేనే ఒళ్లు జలదరిస్తున్న ఈ ఘటనకు సంబంధించిన వవరాలు ఇలా ఉన్నాయి. 

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ముంబైకి సమీపంలోని వసాయి ఏరిలో 2027 మార్చి 30న జరిగింది ఈ అమానవీయ ఘటన. సీసీటీవీ ఫుటేజ్ చూస్తుంటే.. ఆటోలోకి ఎక్కిన బాలుడు విఘ్నేష్ (4)ను బయబటకు గుంజి రెండు కాళ్లు పట్టి నేలకేసి కొట్టాడు దుర్మార్గుడు. సోమవారం సాయంత్రం 7.30 గంటల సమయంలో.. పిల్లలంతా ఆడుతూ ఆడుతూ సందీప్ పవార్ అనే వ్యక్తి ఆటోలో కూర్చున్నారు. వెంటనే వచ్చిన సందీప్ పిల్లాడి కాళ్లు పట్టి బయటకు లాగి ఈ దారుణానికి పాల్పడ్డాడు. పిల్లోడి తలను ముందుగా ఆటోకు కొట్టాడు. ఆ తర్వాత రెండు కాళ్లు పట్టి మొదట తలను నేలకేసి కొట్టాడు. ఆ తర్వాత కాళ్లు పట్టుకుని ఇంట్లోకి పరిగెత్తుతూ ఫస్ట్ ఫ్లోర్ వరకు మెట్లకేసి బాదుకుంటూ వెళ్లాడు. 

ఈ దారుణ ఘటన చూసి పిల్లలంతా భయంతో అరుస్తూ పరిగెత్తారు. బాలుడి నానమ్మ వచ్చి అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఆమెను కూడా కొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ తర్వాత బాలుడిని వోక్హార్ట్ ఆస్పత్రిలో జాయిన్ చేసి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు. విఘ్నేష్ పరిస్థితి క్రిటికల్ గా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు. బ్రెయిన్ కి డ్యామేజ్ అయ్యిందని.. రక్తం గడ్డకట్టే అవకాశం ఉన్నట్లు తెలిపారు. 24 గంటలు గడిస్తే గానీ బాలుడి కండిషన్ గురించి చెప్పలేని వైద్యులు చెప్పారు. 

పగ తీర్చుకుంటానని..

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అతుల్ కొంధారే, సందీప్ పవార్ ఒకే కాంప్లెక్స్ లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఏదో చిన్న విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడు చూసినా అతుల్ ను తిడుతూ, దూషిస్తూ సందీప్ పవార్ తిరిగేవాడట. పగ తీర్చుకుంటానని పలుమార్లు వార్నింగ్ ఇచ్చాడట. అన్నట్లుగానే.. పగబట్టిన పాములా సమయం కోసం ఎదురు చూస్తున్న పవార్.. తన ఆటోలోకి ఎక్కాడనే చిన్న కారణం చూపించి చచ్చేంతలా కాళ్లు పట్టి బండేకేసి కొట్టాడు. చిన్న పాటి గొడవకు మనిషిని చంపేతలా కసి పెంచుకుని ఇలాంటి ఘటనలకు పాల్పడటం.. ఈ రోజుల్లో పెరిగిపోతున్న అసహనపూరిత వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు.