మిల్క్ షేక్లో విషం కలిపి తండ్రిని చంపిన లేడీ పోలీస్.. మూడేళ్ల తర్వాత పెద్ద ట్విస్ట్.. తండ్రి కూడా పోలీసే..

మిల్క్ షేక్లో విషం కలిపి తండ్రిని చంపిన లేడీ పోలీస్.. మూడేళ్ల తర్వాత పెద్ద ట్విస్ట్.. తండ్రి కూడా పోలీసే..

ఈ లేడీ పోలీస్ ఎంత దారుణానికి ఒడిగట్టిందంటే.. తన లాగే తన కూతుర్ని పోలీస్ చేయాలని ఆ తండ్రి అనుకోవడమే పాపం అయినట్లుంది. పెంచి, పెద్ద చేసి, పోలీస్ ను చేసిన ఆదర్శమూర్తి అయిన తండ్రికి విషం ఇచ్చి చంపేసి మూడేళ్లు డౌట్ రాకుండా మేనేజ్ చేసింది ఈ కూతురు. కానీ పాపం అనేది ఎప్పుడో ఒకసారి పండాల్సిందే కదా. అందుకే మూడేళ్ల తర్వాత ఊహించని రీతిలో విధి షాకిచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి. 

అల్లారు ముద్దుగా పెంచి ప్రయోజకురాలిని చేసిన తండ్రికి కూతురు విషమిచ్చి చంపిన ఘటన మహారాష్టరలో జరిగింది. 2023 ఏప్రిల్ 25న పోలీస్ ఆఫీసర్ జయంత్ బల్లావర్ (45) డ్యూటీ కి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అత్యంత ప్రేమ ఒలకబోస్తూ మిల్క్ షేక్ తెచ్చి ఇచ్చింది కూతురు ఆర్య బల్లావర్. ఆ డ్రింక్ తాగి డ్యూటీకి వెళ్లిన జయంత్.. చంద్రాపూ లోని జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి కళ్తు తిరిగి కింద పడి చనిపోయాడు. సడెన్ హార్ట్ అటాక్ తో చనిపోయాడని భావించి.. ఎలాంటి కేసులు, విచారణ లేకుండా క్లోజ్ చేశారు పోలీసులు.

మూడేళ్ల తర్వాత ట్విస్ట్:

ఆర్య బల్లావర్ మరో పోలీస్ ఆశిష్​ షెడ్మకేతో 2022 నుంచి రిలేషన్షిప్ లో ఉంది. తండ్రి జయంత్ బల్లావర్ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో చంపేసేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం తన కజిన్ చైతన్య గెడం (22) సహాయంతో రూ.5 వేలు ఇచ్చి విషం తెప్పించుకుంది. మరుసటి రోజు పొద్దున డ్యూటీకి వెళ్తున తండ్రికి విషం కలిపిన మిల్క్ షేక్ ఇచ్చింది. దీంతో ఆయన చనిపోయారు. 

జయంత్ బల్లావర్ చనిపోయిన తర్వాత కొద్ది రోజులకే.. ఆగమేఘాల మీద తన లవర్, పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న ఆశిష్ ను పెళ్లి చేసుకుంది ఆర్య బల్లావర్. అయితే క్రమశిక్షణ లేకపోవడం, దుష్ప్రవర్తన కారణంగా ఆశిష్​ ను ట్రైనింగ్ నుంచి డిస్మిస్ చేశారు. అయితే ఆర్య అత్తవారి ఇంటికి వెళ్లకుండా తమ ఇంటి దగ్గరే ఉంటూ వస్తోంది. ఈ కారణంగా భార్య భర్తలకు చాలా రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. 

షాకిచ్చిన భర్త:

ఇద్దరి మధ్య గొడలు పీక్స్ చేరుకున్న క్రమంలో.. పోతే జైలుకు పోతా.. కానీ ఈమె బండారం బయటపెట్టాల్సిందే.. అని అనుకున్నాడో ఏమో.. గత వారం పోలీస్ స్టేషన్ కు వెళ్లి తప్పు ఒప్పుకున్నాడు. తన భార్య ఇంకా ముగ్గురం కలిసి విషమిచ్చి మూడేళ్ల క్రితం హత్యకు పాల్పడినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆర్య–ఆశిష్​ కపుల్ తో పాటు చైతన్య గెడం, మరో వ్యక్తిని అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.