న్యూఢిల్లీ: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. ఇండియా ఓపెన్ టోర్నీలో బోణీ చేసింది. బుధవారం జరిగిన విమెన్స్ సింగిల్స్ ఫస్ట్ రౌండ్‌లో నాలుగోసీడ్ సైనా 22–20, 1–0 స్కోరు ఉన్న దశలో అపోనెంట్ టెరెజ్ సబికోవా (చెక్) మ్యాచ్ నుంచి వైదొలిగింది. దీంతో సైనాకు ప్రిక్వార్టర్స్ బెర్త్ లభించింది. మెన్స్ సింగిల్స్‌లో హెచ్. ఎస్. ప్రణయ్ 21–14, 21–7తో పాబ్లో అభియాన్ (స్పెయిన్)పై, థర్డ్ సీడ్ లక్ష్యసేన్ 21–15, 21–7తో అదెమ్ హటెమ్ ఎల్గామల్ (ఈజిప్టు)పై గెలిచి తదుపరి రౌండ్‌లోకి ప్రవేశించారు. మరో మ్యాచ్‌లో అజయ్ జయరామ్ 21–19, 7–21, 14–21తో ఎన్‌హట్ ఎగుయాన్ (ఐర్లాండ్) చేతిలో ఓడాడు. చిట్టబోయిన రాహుల్‌కు వాకోవర్ విక్టరీ లభించింది. విమెన్స్ డబుల్స్‌లో అశ్విని–సిక్కి రెడ్డి 21–7, 19–21, 21–13తో జననీ అనంత్‌కుమార్–దివ్యా బాలసుభ్రమణియన్‌పై గెలిచారు.

