‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్నా: సమంత

 ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో నటిస్తున్నా: సమంత

‘యశోద’ లాంటి ఫిమేల్ సెంట్రిక్ మూవీతో మరోసారి మెప్పించిన సమంత.. వచ్చే నెలలో ‘శాకుంతలం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరోవైపు విజయ్‌‌‌‌‌‌‌‌ దేవరకొండకు జంటగా ‘ఖుషి’ చిత్రంలో నటిస్తోన్న ఆమె, మరికొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌కు కూడా సైన్ చేసింది. అయితే మయోసైటిస్‌‌‌‌‌‌‌‌తో గత కొద్ది నెలలుగా రెస్ట్ తీసుకోవాల్సి రావడంతో షూటింగ్స్‌‌‌‌‌‌‌‌కు బ్రేక్ ఇచ్చింది. దీంతో ఇప్పటికే కమిట్ అయిన హిందీ ప్రాజెక్ట్స్ నుండి ఆమె తప్పుకుందనే ప్రచారం మొదలైంది. ముఖ్యంగా ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌‌‌‌‌‌‌‌లో సమంత నటించడం లేదనే టాక్ ఎక్కువ వినిపించింది. 

వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న ఈ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌ని రాజ్‌‌‌‌‌‌‌‌ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. సమంత తప్పుకుందనే వార్తలను కొట్టిపారేస్తున్న మేకర్స్.. ఈ నెలాఖరు నుండి ఆమె షూట్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనబో తోందని చెబుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాకు ఆమధ్య బ్రేక్ ఇచ్చిన సమంత, ఇటీవల వరుస పోస్టులతో తిరిగి యాక్టివ్ అయ్యింది. న్యూ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విషెస్‌‌‌‌‌‌‌‌తో పాటు ‘శాకుంతలం’ రిలీజ్ డేట్‌‌‌‌‌‌‌‌పై కూడా ఆమె ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన సమంత, త్వరలోనే పూర్తిగా కోలుకుని షూటింగ్స్‌‌‌‌‌‌‌‌తో కూడా బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు అభిమానులు.