కరోనా ఉధృతి: బెంగాల్ లో ఆంక్షలు

కరోనా ఉధృతి: బెంగాల్ లో  ఆంక్షలు

దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. దీంతో ఒక్కో రాష్ట్రం క్రమంగా ఆంక్షల్లోకి వెళ్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించింది. రేపటి నుంచి బెంగాల్ లో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, రెస్టారెంట్లు, పార్కులు క్లోజ్ చేస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ HK ద్వివేది ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులకు ఆంక్షలు వర్తిస్తాయని చెప్పారు. ప్రభుత్వ,ప్రైవేటు ఆఫీసులు 50 శాతం కెపాసిటీతోనే పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆఫీసుల అడ్మినిస్ట్రేషన్ పనులు ఇంటి నుంచే చేయనున్నట్టు చెప్పారు. నైట్ కర్ప్యూ కూడా కొనసాగుతుందని చెప్పారు. 

ఢిల్లీ, ముంబై నుంచి విమానాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. వారంలో రెండు సార్లు మాత్రమే, ఢిల్లీ, ముంబై నుంచి విమానాలను అనుమతిస్తామని సీఎస్ ద్వివేది చెప్పారు. లోకల్ ట్రెయిన్స్ లో రాత్రి 7 గంటల వరకు 50 శాతం మందితోనే నడిపించనున్నట్టు తెలిపారు. ఇక.. పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు 50 మందికి మించొద్దని, అంతిమసంస్కారాల్లో 20 కంటే ఎక్కువ మంది పాల్గొనవద్దని ఆదేశించారు. వెస్ట్ బెంగాల్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న బెంగాల్ లో 4 వేల 5 వందల 12 మందికి కిరోనా నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం బెంగాల్లో  13,300 యాక్టీవ్ కేసులున్నాయి. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ఆంక్షలు విధించినట్టు చీఫ్ సెక్రటరీ చెప్పారు.