శిల్పారామానికి క్యూ కట్టిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్

శిల్పారామానికి క్యూ కట్టిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‭లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. హైటెక్ సిటీలోని శిల్పారామానికి జనాలు క్యూ కడుతున్నారు. శిల్పారామంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పల్లె వాతావరణంతో అక్కడ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గంగిరెద్దులు విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు  స్పెషల్ అట్రాక్షన్‭గా నిలుస్తున్నాయి. పండగ ప్రత్యేకతలు పిల్లలకు తెలిసేలా కార్యక్రమాలు రూపొందించారు. వీటిని చూసేందుకు జనం భారీగా తరలివస్తున్నారు.  దీంతో శిల్పారామానికి వచ్చే రహదారులన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. శిల్పారామానికి వచ్చి వెళ్లే రూట్లలో కిలో మీటరు కొద్దీ వాహనాలు నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.