పాపన్న చరిత్రను భావితరాలకు చాటేలా ‘సర్దార్ సర్వాయి పాపన్న’

పాపన్న చరిత్రను భావితరాలకు చాటేలా ‘సర్దార్ సర్వాయి పాపన్న’

చారిత్రక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర ఆధారంగా దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి రూపొందించిన యానిమేషన్ చిత్రం ‘సర్దార్ సర్వాయి పాపన్న’. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ రిలీజ్ చేస్తున్నారు. మంగళవారం ఈ మూవీ ట్రైలర్‌‌‌‌ను బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్  విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘బహుజనుల రాజ్యం నెలకొల్పాలి, మన రాజ్యం మనమే పరిపాలించుకోవాలని పోరాటం సాగించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న.

అలాంటి ధీరుడి చరిత్రతో ఈ సినిమా వస్తుండడం సంతోషకరం. అలాగే ఆయన చరిత్రను పుస్తకరూపంలోనూ తీసుకొస్తుండటం అభినందనీయం. ఈ నెల 18న ట్యాంక్ బండ్‌‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం ఆవిష్కరిస్తున్నాం’  అని  అన్నారు.  సర్దార్ సర్వాయి పాపన్న  జీవిత చరిత్రను రూపొందించడం చాలా ఆనందంగా ఉందని దర్శక నిర్మాత వెంకటేష్ గౌడ్ లింగంపల్లి అన్నారు. పాపన్న 376వ జయంతి సందర్భంగా ఈనెల 21న సినిమాను రిలీజ్ చేయనున్నట్టు రామకృష్ణ గౌడ్ చెప్పారు.