ఆసియా షూటింగ్ చాంపియన్ షిప్ లో పురుషుల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత షూటర్ సౌరభ్ చౌదరి సిల్వర్ మెడల్ సాధించాడు. సౌరబ్ ఫైనల్లో 244. 5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఉత్తర కొరియా షూటర్ కిమ్ కోంగ్ గుక్ 246. 5 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ కు చేరిన మరో భారత షూటర్ అభిషేక్ వర్మ 181.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. వచ్చే ఏడాది జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌కు సౌరభ్, అభిషేక్ అర్హత సాధించారు.


