మూసీ ఉనికిని దెబ్బతీసేలా ప్రభుత్వ బ్లూప్రింట్

మూసీ ఉనికిని దెబ్బతీసేలా ప్రభుత్వ బ్లూప్రింట్
  •     సీక్రెట్‌‌‌‌గా ఉంచిన ఎన్విరాన్మెంటల్ రిపోర్టు బయట పెట్టాలి
  •     రాష్ట్ర ప్రభుత్వానికి సేవ్ మూసీ మూవ్‌‌‌‌మెంట్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: మూసీ ఉనికిని దెబ్బతీసేలా రాష్ట్ర సర్కారు బ్లూ ప్రింట్‌‌‌‌ రూపొందించిందని సేవ్ మూసీ మూమెంట్ ఆరోపించింది. రహస్యంగా ఉంచిన ఎన్విరాన్మెంటల్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌లను బయటపెట్టాలని డిమాండ్ చేసింది. రూ.1,500 కోట్ల బడ్జెట్‌‌‌‌లో రూ. 375 కోట్ల విడుదలకు అనుమతిచ్చిన సర్కార్.. సోషల్ ఇంపాక్ట్ అసెస్‌‌‌‌మెంట్ (ఎస్ఐఏ) చేయకుండానే ముందుకెళ్లడం అప్రజాస్వామికమని మండిపడింది. సోమవారం హైదరాబాద్‌‌‌‌లోని గన్ పార్క్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్ఎంఎం ప్రతినిధి రుచిత్ ఆశా కమల్ మాట్లాడారు. నది సహజ గర్భాన్ని తొలగించి 21కి.మీ. మేర 70 మీ. వెడల్పుతో సీసీ గ్రేడ్ కాంక్రీట్ ఫ్లోరింగ్ వేయడం మూసీకి కాంక్రీట్ సమాధి కట్టినట్టేనన్నారు.