బడిబాట జూన్లోనే నిర్వహించాలి..విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాకు తపస్ వినతి 

బడిబాట జూన్లోనే నిర్వహించాలి..విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణాకు తపస్ వినతి 

హైదరాబాద్, వెలుగు: టీచర్లంతా ప్రస్తుతం జనగణన విధుల్లో ఉన్నందున, వారికి ఇబ్బంది కలగకుండా బడిబాట కార్యక్రమాన్ని జూన్ లోనే నిర్వహించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి పెంటయ్య కోరారు.

గురువారం హైదరాబాద్ లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా, విద్యాశాఖ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నవీన్ నికోలస్​ను కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం అందించారు. టీచర్ల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. జులై 31ని కటాఫ్ తేదీగా నిర్ణయిస్తూ వెంటనే షెడ్యూల్ విడుదల చేయాలని కోరారు.