హైదరాబాద్ లో 144 సెక్షన్: మహేశ్ భగవత్.

హైదరాబాద్ లో 144 సెక్షన్: మహేశ్ భగవత్.

కేంద్ర ప్రభుత్వం  370 ఆర్టికల్ రద్దు చేసిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించామన్నారు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్. పర్మిషన్ లేకుండా ఎలాంటి ర్యాలీలు, సెలబ్రేషన్స్ చేసినా…. చట్టపరమైన చర్యలుంటాయని హెచ్చరించారు. నైట్ అంతా పోలీసులు స్టేషన్లోనే ఉంటారన్నారు. శాంతిభద్రతల సమస్య రాకుండా ప్రజలు సహకరించాలని కోరారు మహేశ్ భగవత్.