ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది : డీఎంకే సీనియర్ నేత అనితా రాధాకృష్ణన్

ఆరు నెలల్లో విజయ్ ప్రభుత్వం కూలిపోతుంది : డీఎంకే సీనియర్ నేత అనితా రాధాకృష్ణన్
  • డీఎంకే సీనియర్ నేత అనితా రాధాకృష్ణన్ సంచలన వ్యాఖ్యలు 

చెన్నై: తమిళనాడు సీఎం విజయ్‌‌ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే కూలిపోతుందని డీఎంకే సీనియర్ నేత, తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ అన్నారు. డీఎంకే చీఫ్​ ఎంకే. స్టాలిన్ త్వరలోనే మళ్లీ సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీవీకే కీలక నేత, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జున ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తనపై పోటీ చేయాలని బహిరంగ సవాల్ విసిరారు.

ఈ మేరకు సోమవారం దక్షిణ తమిళనాడులో జరిగిన ఒక పార్టీ కార్యక్రమంలో రాధాకృష్ణన్ మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వం మహా అయితే ఇంకొక నాలుగు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది. టీవీకేలో ఆధవ్ అర్జున అనే వ్యక్తి ఉన్నారు. ఆయనకు నిజంగా దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేస్తాను. ఇద్దరం తిరుచెందూర్‌‌లో పోటీ చేద్దాం” అని ఆయన సవాల్ విసిరారు.