నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్

అంతర్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో.. స్టాక్ మార్కెట్ మంగళవారం కూడా నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 125.42 పాయింట్ల నష్టంతో 52,721.28 పాయింట్ల వద్ద .. నిఫ్టీ 30.20 పాయింట్ల నష్టంతో 15,744.20 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను ప్రారంభించాయి.  ఉదయం 10 గంటల సమయానికి సెన్సెక్స్ నష్టం 92.61 పాయింట్లకు తగ్గి 52,754కు చేరగా, నిఫ్టీ నష్టం 22.15 పాయింట్లకు తగ్గి 15,752కు చేరింది.  మరోవైపు సోమవారం కూడా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆసియా, పసిఫిక్ మార్కెట్లు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి.  ద్రవ్యోల్బణ భయాలు, వడ్డీరేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు కలవరపెడుతున్నాయి.  

టాప్ గెయినర్స్..

ఎక్కువగా లాభపడిన షేర్ల జాబితాలో  అపోలో హాస్పిటల్ (2.27 శాతం), అదానీ పోర్ట్స్ (1.55 శాతం), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.48 శాతం), ఎన్టీపీసీ (1.34 శాతం), విప్రో (1.13 శాతం) ఉన్నాయి.

టాప్ లూజర్స్..

ఎక్కువగా నష్టపోయిన షేర్ల జాబితాలో బీపీసీఎల్ (1.48 శాతం), ఏషియన్ పెయింట్స్ (1.40 శాతం), ఓఎన్జీసీ (0.91 శాతం), రిలయన్స్ (0.90 శాతం), బజాజ్ ఆటో (0.86 శాతం) ఉన్నాయి.