Zara Hatke Zara Bachke OTT: 11 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్‌ హిట్ కామెడీ.. తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఇదే

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల తర్వాత ఓటీటీలోకి రొమాంటిక్‌ హిట్ కామెడీ.. తెలుగు స్ట్రీమింగ్ డేట్ ఇదే

బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్‌, బ్యూటీ సారా అలీఖాన్‌ కీలక పాత్రల్లో నటించిన మూవీ ‘జర హట్కే జర బచ్కే’ (Zara hatke zara bachke). లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకుడు. ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ గతేడాది జూన్ 2న థియేటర్లలో రిలీజ్ అయి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

రూ.40కోట్లతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.115 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా కథ సహజత్వానికి దగ్గరగా ఉండటంతో ఆడియన్స్ చాలా వరకు కనెక్ట్ అయ్యారు. ఇక ఏ సినిమా రిలీజ్ అయి 11 నెలలు గడుస్తున్నా ఓటీటీ రిలీజ్ కు నోచుకోలేదు దీంతో ఆడియన్స్ కాస్తా డిసప్పాయింట్ అయ్యారు.

ఇక ఎట్టకేలకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో సినిమాలో మే 17 నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ చేయనున్నట్లు జియో సినిమా ప్రకటించింది.

కథేంటి?

కపిల్ (విక్కీ కౌశల్), సౌమ్య చావ్లా (సారా అలీఖాన్) దంపతులు. ఊళ్లో ఒక చిన్న ఇంట్లో హాయిగా ఉంటుంటారు. కపిల్ యోగా ఇన్​స్ట్రక్టర్​. మిడిల్ క్లాస్​ ఆలోచనలతో ఉంటాడు. సౌమ్య మోడర్న్​​ పంజాబీ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో తనకు నచ్చినట్టు ఉంటుంది. వాళ్లిద్దరూ సంతోషంగానే ఉన్నా సౌమ్య మాత్రం ఆ ఇంట్లో ప్రైవసీ లేదని ఫీలవుతుంది. త్వరలోనే డ్రీమ్​ హౌస్  కట్టుకోవాలని కలలు కంటుంది. ఈఎమ్​ఐలు కట్టే పరిస్థితులు వాళ్లకు లేకపోయినా తన నిర్ణయం మాత్రం మారదు.

సరిగ్గా అదేటైంలో విడాకులయిన వాళ్లకు లాటరీ ఛాన్స్ అనే ఒక స్కీమ్​లో చేరతారు. అప్పటి నుంచి వాళ్లు విడాకులు తీసుకోవాలి అనుకుంటున్నట్టు అందర్నీ నమ్మించేలా గొడవపడుతుంటారు. వేరుగా ఉంటుంటారు. మరి ఇంతకీ వాళ్ల కల నిజమైందా? వాళ్లు ఇద్దరూ ఆడే నాటకం ఏ పరిస్థితులకి దారి తీస్తుంది? సంతోషంగా ఉన్న దంపతుల కథ చివరికి ఏమవుతుందో  తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిందే. ఇందులో నటీనటుల యాక్టింగ్ బాగుంది. ఫక్కా ఫ్యామిలీ ఎంటర్​టైనర్.