మధుయాష్కీ ఇంట్లో ఎన్నికల సిబ్బంది తనిఖీలు

మధుయాష్కీ ఇంట్లో ఎన్నికల సిబ్బంది తనిఖీలు

మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ ఇంటి వద్ద ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్  అధికారులు తనిఖీలు చేపట్టారు. హయత్ నగర్ లోని మధుయాష్కి నివాసంలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదుతో ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేశారు. ఆయన ఇంటితో పాటు పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు. వారికి ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు అధికారులు.

మరోవైపు దుబ్బాక మున్సిపల్ ధర్మాజీపేట వార్డులో బీఆర్ఎస్ నాయకులు పైసలు పంచుతున్నారన్న  విషయం తెలుసుకొని బీజేపీ నాయకులు వారిని పట్టుకొని పోలీసులకు అప్పచెప్పారు. ఓ వ్యక్తి నుంచి 11 వేల 500 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.