మూతపడ్డ నర్మదా ఫుడ్స్ ..కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన

మూతపడ్డ నర్మదా ఫుడ్స్ ..కంపెనీ ఎదుట కార్మికుల ఆందోళన

ఇబ్రహీంపట్నం, వెలుగు : వివిధ రకాల బిస్కెట్లు తయారు చేస్తున్న నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2009లో నాచారంలో నెలకొల్పారు. 2018లో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూర్ కు ఈ కంపెనీని మార్చారు. ఈ కంపెనీలో సుమారు 300 మంది ఉండగా, ఇందులో 260 మంది కాంట్రాక్టు వర్కర్లు, మిగతా 40 మంది ఉద్యోగులు ఉన్నారు. 

2025 డిసెంబర్ 1న నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో పార్లే బిస్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. దీంతో బొంగ్లూర్ లోని నర్మదా ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీని యాజమాన్యం మూసివేసింది. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఉద్యోగులు, కార్మికులు, సూపర్​వైజర్లు, ఆపరేటర్లు మంగళవారం కంపెనీ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కంపెనీ మూసివేయడంతో తమ కుటుంబాలు రోడ్డు పడ్డాయని తెలిపారు. జీతాలు కూడా సెటిల్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.