గంజాయి దందాలో ఇంజినీరింగ్ స్టూడెంట్స్..పలువురు అరెస్ట్.. రూ.10 లక్షల సరుకు సీజ్

గంజాయి దందాలో ఇంజినీరింగ్ స్టూడెంట్స్..పలువురు అరెస్ట్.. రూ.10 లక్షల సరుకు సీజ్

మేడ్చల్, వెలుగు: గంజాయి, హాష్ ఆయిల్ అమ్ముతున్న ఇంజినీరింగ్ విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో బీటెక్ థర్డియర్ చదువుతున్న కొందరు విద్యార్థులు ఏపీ నుంచి బైక్​లపై 6 కిలోలకు పైగా గంజాయి, 1 లీటర్ కు పైగా హాష్ ఆయిల్ తెచ్చి అమ్ముతున్నారు. 

దీనిపై ముందస్తు సమాచారం రావడంతో మేడ్చల్ ఎస్​వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. మెట్రో ల్యాండ్ మార్క్ నియర్ రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తాగుతున్న 7 మంది, అమ్ముతున్న 3 మందిని అదుపులోకి తీసుకున్నారు. 

మొత్తం రూ.10 లక్షలకు పైగా విలువైన సరకు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా కరీంనగర్ జిల్లా ప్రాంతానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరిని మేడ్చల్ పోలీసులకు అప్పగించారు.