జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల సంచారానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి గ్రహం నిర్ణీత కాలవ్యవధిలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ మార్పుల ప్రభావం అన్ని రాశులపై ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో ఈ గ్రహాల సంయోగం వల్ల ప్రత్యేకమైన యోగాలు ఏర్పడతాయి. ప్రస్తుతం జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మకర రాశిలో మూడు గ్రహాలు ( సూర్యుడు, శుక్రుడు, కుజుడు ) కలవడం ఏర్పడిన ల్లో రాజయోగాలు అత్యంత శుభప్రదమైనవిగా జ్యోతిష్యులు పేర్కొంటారు.
కుజుడు మకర రాశిలో ఫిబ్రవరి 23 వరకు సంచరిస్తాడు. ఈ కాలంలో ఏర్పడే ప్రత్యేక యోగం రుచక మహా పురుష యోగం ప్రభావం నాలుగు రాశుల వారి జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకొస్తుందని పండితులు చెబుతున్నారు.
రుచక మహా పురుష యోగం అంటే ఏంటి?
కుజుడు ఏ రాశికి లగ్నం, నాలుగు.. ఏడు.. పదవ స్థానాల్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ స్థితి వ్యక్తిలో నాయకత్వ లక్షణాలు, ధైర్యం, నిర్ణయశక్తిని పెంచుతుంది. జీవితంలో సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు బలపడతాయి.
మకరరాశి లో కుజగ్రహం .. ఇప్పటికే ఉన్న.. సూర్యుడు.. శుక్రుడిని కలవడంతో మేషం, కర్కాటకం, తుల, మకర రాశులకు రుచక మహా పురుష యోగం ఏర్పడింది. ఈ రాశుల వారికి ధనం, పదవి, గౌరవం లభించే అవకాశాలున్నాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేష రాశి : ఈ రాశి వారికి ఈ యోగాలు వారి జాతకంలోని పదవ ఇంట్లో ఏర్పడింది. జ్యోతిష్య ప్రకారం . .పదవ ఇల్లు వృత్తి, గౌరవం, బాధ్యతల విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. మహాపురుష యోగ ప్రభావం వలన ఈ రాశి వారి జీవితంలో కొన్ని కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వృత్తి పరంగా కొన్ని కొత్త అవకాశాలు రావడం.. నిరుద్యోగులకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇక ఆర్థిక విషయాలకు వస్తే పరిస్థితి మెరుగు పడే అవకాశం ఉంది. పాత బకాయిలు వసూలవుతాయి. పెళ్లి సంబంధం చూసే వారు శుభవార్త వింటారు.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి రెండు రాజయోగాలు ఏడవ ఇంట్లోనే ఏర్పడ్డాయి. ఏడవ ఇల్లు వివాహం, భాగస్వామ్యం, వ్యాపార విషయాలను నిర్దేశిస్తుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అవగాహన మెరుగవుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. కొన్ని అనుకోని మార్గాల ద్వారా ఆర్థికంగా పుంజుకుంటారు. కుటుంబంలో నెలకొన్న సమస్యలు క్రమంగా పరిష్కారమవుతయి. ఆర్థిక లావాదేవీల ఒత్తిడి తగ్గే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
తులా రాశి: తులా రాశి వారి జాతకంలో ఐదవ ఇంట్లో ఈ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఐదవ ఇల్లు బుద్ధి, విద్య, సృజనాత్మకత, ప్రేమకు సంబంధించినది. ఈ ప్రభావంతో తుల రాశి వారికి గృహ సంబంధిత లాభాలు కనిపిస్తాయి. ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా ముగుస్తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. సాధారణ స్థితిలో ఉన్నవారు సైతం ఆర్థికంగా బలపడతారు. అనేక రంగాల్లో పురోగతి కనిపించవచ్చు. వృత్తిలో ఉన్న పోటీ తగ్గి పనిలో స్థిరత్వం వస్తుంది. వ్యక్తిగత జీవితం, వృత్తి జీవితంలో సంతృప్తి పెరుగుతుంది. ప్రేమ...పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
మకర రాశి.. ఈ రాశి వారికి డబుల్ రాజయోగం మూడవ ఇంట్లో ఏర్పడింది. మూడవ ఇల్లు ధైర్యం, ప్రయత్నం, సోదర సంబంధాలకు సూచిక. ఈ ప్రభావంతో మకర రాశి వారికి ఈ యోగం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుంది. సమాజంలో పేరు, ప్రతిష్ఠ పెరుగుతుంది. ప్రభుత్వ సంబంధిత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరగడం, కుటుంబ ఆస్తి లభించడం వంటి సూచనలు ఉన్నాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి జీతం లేదా ఇతర లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ ఆర్థిక స్థితి క్రమంగా బలపడుతుందిఆత్మవిశ్వాసం పెరగడం.. చాలా కాలంగా వాయిదా పడిన పనులు పూర్తయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
