యుద్ధం వేళ..చమురు ముప్పుకు భారత రైల్వే శాఖ చెక్

యుద్ధం వేళ..చమురు ముప్పుకు భారత రైల్వే శాఖ చెక్
  • 62% డీజిల్ వాడకం తగ్గించి ఎలక్ట్రిఫికేషన్​తో భర్తీ 

న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో  పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందన్న ఆందోళనలపై రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. దేశంలోని బ్రాడ్ గేజ్ నెట్‌‌వర్క్‌‌లో 99.4% ఎలక్ట్రిఫికేషన్‌ పూర్తయిందని తెలిపింది. 2016–17లో రైల్వేలు వాడిన డీజిల్ మొత్తంతో పోలిస్తే 2024–25 నాటికి ఆ వాడకం 62 శాతానికి తగ్గిపోయిందని చెప్పింది. దీనివల్ల భారత రైల్వే 178 కోట్ల లీటర్ల డీజిల్ ఆదా చేసిందని వెల్లడించింది.

మన రైళ్లు బొగ్గు, జల, సౌర, ఇతర పునరుత్పాదక ఇంధనాలతో తయారయ్యే విద్యుత్తుతోనే నడుస్తున్నాయని చెప్పింది. 2024–25లో రైల్వే శాఖ ఇంధనం కోసం ఖర్చు చేసిన రూ.32,378 కోట్లలో ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తి కోసమే ఖర్చు చేసినట్లు తెలిపింది. ఎలక్ట్రిఫికేషన్​తో రైళ్లను నడపటం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌‌లో చమురు ధరల హెచ్చుతగ్గుల ప్రభావం రైల్వేపై పడదని పేర్కొంది.