భద్రాచలం, వెలుగు : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని వీరం గ్రామఅడవుల్లో మావోయిస్టుల డంప్‌ను శుక్రవారం సీఆర్‌పీఎఫ్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కిష్టారం అడవుల్లో డంప్ ఉన్నట్లు సమాచారం అందడంతో సీఆర్‌పీఎఫ్ 217 బెటాలియన్ జవాన్లు కూంబింగ్ ప్రారంభించారు. డంప్ ఉన్న ప్రాంతాన్ని డాగ్‌స్క్వాడ్ పసిగట్టడంతో.. మూడు బర్మార్ రైఫిల్స్, బ్యారెల్ డిటోనేటర్లు, 100 మీటర్ల వైరు, ఒక బ్యాటరీ, తూటాలు, టిఫిన్ బాక్స్ ఐఈఈడీని స్వాధీనం చేసుకొని కిష్టారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
