- లారీ డ్రైవర్, హమాలీ మృతి
- బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలు
అడ్డాకుల, వెలుగు: ఆర్టీసీ బస్సు అదుపుతప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ డిపోకు చెందిన లగ్జరీ బస్సు సుమారు 40 మంది ప్రయాణికులతో శుక్రవారం తిరుపతికి బయల్దేరింది.
కొమ్మిరెడ్డిపల్లి సమీపంలో బస్సు అదుపుతప్పి డివైడర్ మీది నుంచి రోడ్డు అవుతల వైపు వెళ్లింది. అదే సమయంలో కొత్తకోట మండలం కనిమెట్ల గ్రామం నుంచి సిమెంట్ పైపుల లోడుతో లారీ వస్తోంది. ఆ లారీని బస్సు వేగంగా ఢీకొట్టడంతో కొత్తకోట మండలం వడ్డేవాటకు చెందిన లారీ డ్రైవర్ నందిపేట రవి(35), లారీలో హమాలీగా పనిచేస్తున్న కొత్తకోటకు చెందిన నాగన్న(38) అక్కడికక్కడే మృతిచెందారు.
బస్సు డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. అదనపు డ్రైవర్, ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్‌లో జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అటుగా వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలించారు.
