మాస్కో: గ్రీన్ లాండ్ పై రష్యా, చైనా కన్నేశాయని, అందుకే వాటి కంటే ముందు తామే స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో ఈ అంశంపై రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్ రోవ్ మంగళవారం మాస్కోలో మీడియా ముందు స్పందించారు.
గ్రీన్ లాండ్ ప్రాంతం డెన్మార్క్ లేదా నార్వేలో సహజ భాగం కాదన్నారు. అది వలసవాద పాలనలో ఆక్రమించుకున్న భూభాగం మాత్రమేనన్నారు. అయితే, గ్రీన్ లాండ్ ను తన కంట్రోల్ లోకి తీసుకోవాలని రష్యా అనుకుంటోందన్న ట్రంప్ కామెంట్లపై లావ్ రోవ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తమకు అలాంటి ఆలోచనలేమీ లేవని ట్రంప్ కు బాగా తెలుసన్నారు.
