న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ చేజార్చుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ కోసం సిద్ధమవుతోంది. 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 21) నాగ్‌పూర్ వేదికగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ లో జరగనుంది. వరల్డ్ కప్ స్వదేశంలో జరగనుండడంతో ఈ 5 టీ20 మ్యాచ్ లను ఇండియా ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని చూస్తుంది. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది. మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. తొలి టీ20 మ్యాచ్ లో ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం.
అభిషేక్ శర్మతో పాటు సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నారు. బ్యాకప్ వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ మూడో స్థానంలో ఆడే అవకాశం ఉంది. వరల్డ్ కప్ కు కిషాన్ సెలక్ట్ అయ్యాడు. మరోవైపు శ్రేయాస్ కేవలం న్యూజిలాండ్ టీ20 సిరీస్ కు మాత్రమే ఎంపికయ్యాడు. ఈ కారణంగా గాయపడిన తిలక్ వర్మ స్థానంలో జట్టులో వచ్చిన శ్రేయాస్ అయ్యర్ కు ప్లేయింగ్ 11లో చోటు దక్కే అవకాశాలు లేవు. వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉన్న కిషాన్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్టు సమాచారం. నాలుగో స్థానంలో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బ్యాటింగ్ కు వస్తాడు. ఐదో స్థానంలో ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య స్థానానికి ఎలాంటి ఢోఖా లేదు.
ఆరో స్థానంలో రింకూ సింగ్ లేదా శివమ్ దూబేలలో ఒకరు జట్టులోకి రానున్నారు. దూబే ఆల్ రౌండర్ కావడంతో ఛాన్స్ లభించే అవకాశం ఉంది. ఏడో స్థానంలో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్థానం పక్కా. ఎనిమిదో స్థానంలో హర్షిత్ రానాకు ఛాన్స్ దక్కొచ్చు. ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో హర్షిత్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ లోనూ అదరగొట్టాడు. దీంతో జట్టు యాజమాన్యం రానా వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్థానాలు కన్ఫర్మ్ అయిపోయాయి. ఫాస్ట్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా జట్టులో కొనసాగుతాడు. తొలి టీ20కి రింకూ సింగ్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషాన్,రవి బిష్ణోయ్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి.
న్యూజిలాండ్ తో తొలి టీ20కి ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా)
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్
