OTT Movie Review: ఓటీటీలో కట్టిపడేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. మిస్టరీ, సస్పెన్స్‌తో ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్

OTT Movie Review: ఓటీటీలో కట్టిపడేసే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్.. మిస్టరీ, సస్పెన్స్‌తో ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్

తెలుగు ప్రేక్షకులకు అసలైన వినోదం అంటే సినిమాలే. విభిన్నమైన జానర్స్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ప్రస్తుతం థియేటర్లలోనూ, ఓటీటీ ప్లాట్‌ఫాంలలోనూ మంచి కంటెంట్ అందుబాటులో ఉంది. ఒకవైపు సంక్రాంతి సినిమాలతో థియేటర్లలో సందడి కొనసాగుతుంటే, మరోవైపు ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో ప్రేక్షకులు పండగ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఓటీటీలో, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తెలుగు డబ్బింగ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌ సిరీస్ ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’ (Dhoolpet Police Station). ఇందులో తమిళ యంగ్‌ హీరోలు అశ్విన్‌, శ్రీతు కృష్ణన్‌, గురు ప్రధాన పాత్రల్లో నటించగా, జస్విని డైరెక్ట్ చేశాడు. 

ఈ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ కథనం, ఉత్కంఠభరితమైన మలుపులతో ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. డిసెంబర్ 5 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రతి శుక్రవారం ఒక్కో ఎపిసోడ్ విడుదల చేస్తూ ఇప్పటి వరకు మొత్తం 20 ఎపిసోడ్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

క్రైమ్, మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ అంశాలతో తెరకెక్కిన ఈ సిరీస్‌ను చూసిన ప్రేక్షకులు నుంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే థ్రిల్లర్ సిరీస్ ఆహా ప్లాట్‌ఫాంలో మోస్ట్ ట్రెండింగ్లో దూసుకెళ్తోంది. ఇంతకీ ఈ వెబ్‌ సిరీస్‌లో ఉన్న స్పెషల్ పాయింట్స్ ఏంటి? కథ, కథనం, నటీనటుల ప్రదర్శన ఎలా ఉంది? ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తున్న అంశాలు ఏంటన్నది పూర్తి రివ్యూలో తెలుసుకుందాం..

కథేంటంటే:

‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’ కథనం.. దసరా నవ రాత్రుల వేళ ప్రారంభమవుతుంది. ఆ స్టేషన్‌లో కొత్తగా ఏసీపీగా వెట్రి మారన్ (అశ్విన్ కుమార్) చేరతాడు. అతను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అవినీతి అంటే అస్సలు పాడనీ వ్యక్తిగా డిపార్ట్ మెంట్ లో మంచి పేరు ఉంటుంది. అదే స్టేషన్‌లో కానిస్టేబుల్ మాసాని (పద్మినీ కుమార్) కూడా ఉంటారు. మాసానీ అమ్మవారి భక్తురాలిగా, ఆత్మార్పణలో విశ్వసనీయురాలి అని ఊరి వాళ్ల నమ్మకం. 

►ALSO READ | 'ఆకాశంలో ఒక తార'లో సాత్విక వీరవల్లి ఫస్ట్ లుక్

అలా దసరా ఉత్సవాలు జరుగుతున్న సమయంలో, తెల్లారితే మూడు హత్యలు జరగబోతున్నట్లు పోలీసులకు తెలిసిపోతుంది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, ఊహించినట్లుగానే మూడు హత్యలు జరగడం ఊర్లో ఆందోళన కలిగిస్తుంది. పోలీసులకి కూడా ఈ కేసు ఛాలెంజింగ్గా మారుతుంది. ఈ క్రమంలో ఈ మిస్టీరీయస్ హత్యల వెనుక ఎన్నో ప్రశ్నలు తలెత్తుతాయి. 

  • ఇంతకీ ఈ హత్యలు ఎందుకోసం జరిగాయి?
  • వాటి వెనుక ఎవరు ఉన్నారు?
  • పోలీసులు కేసును ఎలా ఛేదించారు?
  • కేసును పరిష్కరించేందుకు ఇద్దరు ఏసీపీలు ఎందుకు నియమితులు అవ్వాల్సి వచ్చింది?
  • చివరికి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి?

ఈ మిస్టరీ, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్ రహస్యాలన్నీ తెలుసుకోవాలంటే, ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’ సిరీస్ చూడాల్సిందే.

ఎలా ఉందంటే?

క్రైమ్ థ్రిల్లర్ జోనర్ను ఇష్టపడే వారికి ఈ సిరీస్ ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా మన తెలుగు ఆడియన్స్ కి సినిమాలు చూడాలంటే, భాష, భావం, హీరోలు అనేది తేడా ఏమిలేదు. కథ, ఉత్కంఠరేపే క్రైమ్ ఉంటే చాలు. ఆడియన్స్ తెగ ఎంజాయ్ చేసేస్తారు. సరిగ్గా అలాంటి వారికోసమే ఈ సిరీస్ రావడం మరీ ప్రత్యేకం. కథనంలో ఉరకలెత్తేనిచే స్క్రీన్ ప్లే, హత్యలను ఛేదించే క్రమంలో వచ్చే సస్పెన్స్ ఆసక్తి కలిగిస్తోంది. 

సింపుల్‌గా చెప్పాలంటే.. ఒకే రాత్రి జరిగిన మూడు హత్యలను ఇద్దరు పోలీసు అధికారులు ఎలా ఛేదించారనేది సిరీస్ ప్రధాన కాన్సెప్ట్. పగ, ప్రతీకారం, వ్యక్తిగత అనుమానాల చుట్టూ కథ తిరుగుతుంది. ధూల్‌పేట్‌లోని రౌడీ రాజకీయాలను పోలీస్ స్టేషన్‌తో ముడిపెడుతూ డైరెక్టర్ జస్విని అత్యంత ఆసక్తికరంగా మలిచారు.

ఊర్లోని రౌడీ రాజకీయాలు, పాత పగలను చూపిస్తూ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని ఆసక్తికరంగా ఫ్రేమ్ చేశారు. పగ, ప్రతీకారం, రాజకీయ వత్తిడి మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు అనే అంశాన్ని సీరీస్ చక్కగా చూపిస్తోంది.

యూనిక్ పాయింట్:

హత్యలు జరిగాక కేసు ఛేదించడం సాధారణంగా ప్రతి క్రైమ్ స్టోరీలో చూస్తూనే వస్తున్నాం. కానీ మూడు హత్యలు జరగబోయే విషయం ముందే పోలీసులకు తెలిసి, వాటిని ఛేదించడానికి సాగే కథనంతో తెరకెక్కిన సినిమాలు మాత్రం చాలా అరుదు. అలాంటి బలమైన పాయింట్తో తెరకెక్కిన ఈ సిరీస్ ఆడియన్స్ని ఎంగేజ్ చేస్తోంది. ఓవరాల్గా చెప్పాలంటే.. బలమైన కథనం, ఉత్కంఠకరమైన స్క్రీన్‌ప్లే ఉంటే.. అది సక్సెస్ అవుతుందని ‘ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్’ ప్రూవ్ చేసింది. 

పోలీసు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్: సస్పెన్స్, టెన్షన్, డిటెక్షన్ అన్నీటిని మిళితం చేస్తూ సాగిన ఈ సిరీస్ ఆసక్తికరంగా ఉంది. పోలీసుల కష్టాలు, రిస్క్ ఫాక్టర్స్ చెబుతూ రియాలిటీ టచ్ ఇస్తూ ఆకట్టుకుంటోంది. 

క్రియేటివ్ డైరెక్షన్: ఊరి రాజకీయాలు, మనుషుల మధ్య పగలు, పోలీస్ స్టేషన్ పరిస్థితులు, థ్రిల్లింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అంశాలతో డైరెక్టర్ జస్విని సీరీస్ రూపొందించారు.

సిరీస్ మలుపులు: పగ, ప్రతీకారం, రాజకీయ ఒత్తిడి మధ్య, పోలీస్‌లు సమస్యలు ఎదుర్కొనే సీన్స్ ఆసక్తికరం. 

ఎవరెలా నటించారంటే:

ఇద్దరు ఏసీపీలు: మూడు హత్యలను ఛేదించడానికి ఇద్దరు ఏసీపీలు నియామకం కావడం సీరీస్‌లో ప్రత్యేక పాయింట్‌గా నిలిచింది. ఈ అంశాన్ని దర్శకుడు జస్విని బాగా హైలైట్ చేశారు. అశ్విన్ కుమార్ మరియు గురు లక్ష్మణ్ పోలీసు అధికారులుగా నటించి, తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు. కేసు ఛేదించే క్రమంలో వారి బాడీ లాంగ్వేజ్, ఇమోషనల్ రియాక్షన్స్ ప్రేక్షకులకు మలుపు తిప్పే థ్రిల్ అనుభవాన్ని ఇస్తాయి.

కానిస్టేబుల్ పాత్ర

పద్మినీ కుమార్, కానిస్టేబుల్ మాసాని పాత్రలో, అద్భుతమైన నటనతో సీరీస్‌కు ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చారు. ఆమె పాత్రతో వచ్చే ఎమోషనల్ సీన్స్, అనుమానాలు, భయాలు వంటి తరహా సాగే సీన్స్, కథను మరింత ఆసక్తికరంగా మలుస్తుంది. మిగతా పాత్రల్లో నటించిన నటులు కూడా కథలో లీనమయ్యి నటించి ఆకట్టుకున్నారు. 

టెక్నీకల్ అంశాలు:

క్రియేటివ్ డైరెక్షన్: ఊరి రాజకీయాలు, మనుషుల మధ్య పగలు, పోలీస్ స్టేషన్ పరిస్థితులు, థ్రిల్లింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అంశాలతో డైరెక్టర్ జస్విని సీరీస్ ఆసక్తిగా రూపొందించారు. పవర్‌ఫుల్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ + ఎమోషనల్ ఇంపాక్ట్ సీన్స్తో సీరీస్పై ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలా చేసి సక్సెస్ అయ్యాడు.

అలాగే కథనాన్ని తీర్చిదిద్దంలో బ్రహ్మ జీ దేవ్ తన ప్రత్యేక స్టైల్‌తో సీరీస్‌ని మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. అశ్వత్ అందించిన మ్యూజిక్.. క్రైమ్ థ్రిల్లర్ సీరీస్‌కు పర్‌ఫెక్ట్గా ఫిట్ అయి, సస్పెన్స్ మరియు థ్రిల్ అనుభూతిని పెంచింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అన్నీ చక్కగా కుదిరి సిరీస్ ని కట్టుదిట్టంగా మలచడంలో ప్రధాన బలంగా నిలిచాయి.