Movie Review: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రివ్యూ.. శివాజీ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Movie Review: ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ రివ్యూ.. శివాజీ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

90s వెబ్ సిరీస్, కోర్ట్, దండోరా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శివాజీ, ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అదే క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’(Sampradayini Suppini Suddapoosani).

ఈ సినిమాలో శివాజీ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించాడు. ఈ సందర్భంగా శుక్రవారం (మార్చి 6, 2026న) మూవీ థియేటర్లోకి వచ్చింది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శివాజీ, లయ భార్యాభర్తలుగా నటించారు. 90s వెబ్ సిరీస్‌లో శివాజీకి కొడుకుగా నటించిన యంగ్ ఆర్టిస్ట్ రోహన్ ఈ సినిమాలో కూడా అదే తరహా పాత్రలో కనిపించాడు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకోవడంతోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

మొదట ఈ సినిమాని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని భావించినప్పటికీ, కథలో ఉన్న ఇంపాక్ట్ కారణంగా పెద్దతెరకు తీసుకువచ్చారు. అంతేకాకుండా నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి సహకరించడంతో చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యూలో తెలుసుకుందాం.

ALSO READ : 66 ఏళ్ల వయసులో నీనా గుప్తా ప్రెగ్నెంటా? 

కథేంటంటే:

శ్రీరామ్ (శివాజీ) ఒక నిజాయితీ గల విలేజ్ సెక్రటరీ. భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు (రోహన్)తో సాదాసీదా జీవితం గడుపుతుంటాడు. వీళ్లది చాలా సింపుల్ ఫ్యామిలీ. అలాగే, డిఫెరెంట్ మనస్తత్వం ఉన్న ఫ్యామిలీ కూడా!

శ్రీరామ్ పంచాయితీ కార్య‌ద‌ర్శిగా సక్రమంగా విధులు నిర్వర్తిస్తుంటాడు. మంచికి మారుపేరైన వ్యక్తిగా, తప్పును సమర్థించని మనస్తత్వం కలిగిన వ్యక్తిగా పనిచేస్తాడు. ఈ క్రమంలోనే ఆడవాళ్ల పిచ్చి ఉన్న స్థానిక ఎస్సై విక్రమ్ (ప్రిన్స్).. శ్రీరామ్ భార్య ఉత్తరపై కన్నేస్తాడు.

ఒక రోజు శ్రీరామ్ లేని సమయంలో వారి ఇంటికి వచ్చిన విక్రమ్ అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అప్పటివరకు ఓ వింత చేష్టలతో గడిపే శ్రీరామ్ ఫ్యామిలీ, ఎస్సై విక్రమ్ చావుతో ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది.

ఇంతకీ ఎస్సై విక్రమ్ని ఎవరు, ఎలా చంపారు? ఈ క్రైమ్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి శ్రీరామ్ ఏం చేశాడు? శవాన్ని మాయం చేసే ప్రయత్నంలో శ్రీరామ్కి ఎదురైన గందరగోళం ఏంటి? మరోవైపు కోటి రూపాయల గిఫ్ట్ బ్యాగ్ కోసం ఎలాంటి తతంగం నడిచింది? ఈ గందరగోళంలో కానిస్టేబుల్ సుధీర్ (ధనరాజ్), లోకల్ ఎమ్మెల్యే పాత్ర ఎంత? చివరికి శ్రీరామ్ ఫ్యామిలీ ఈ క్రైమ్ నుంచి బయట పడిందా? లేదా అన్నదే మిగతా కథ. 

విశ్లేషణ 

క్రైమ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ను కలిపి దర్శకుడు సుధీర్ శ్రీరామ్ చాలా చక్కగా తెరకెక్కించాడు. శ్రీరామ్ పాత్ర సాంప్రదాయానికి అనుగుణంగా ఉంటే, ఉత్తర పాత్ర సుప్పనాతితనంతో ఉంటుంది. మిక్కీ పాత్ర సుద్దపూసలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ఈ విధంగా వీరి క్యారెక్టర్లతో సినిమా టైటిల్కి న్యాయం చేశాడు డైరెక్టర్ సుధీర్. 

ఫస్టాఫ్ శ్రీరామ్ కుటుంబం చుట్టూ తిరిగే సరదా సన్నివేశాలు, వారి డిఫరెంట్ బిహేవియర్ ప్రేక్షకులను నవ్విస్తాయి. ముఖ్యంగా ఎస్సై విక్రమ్ హత్య తర్వాత కథ అసలు ట్రాక్‌లోకి వచ్చి క్రైమ్ కామెడీగా మారుతుంది.

శవాన్ని మాయం చేసే క్రమంలో వచ్చే గందరగోళం, కామెడీ సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి.అదే సమయంలో కథలో సస్పెన్స్ కూడా కొనసాగుతుంది. అయితే, కొన్ని చోట్ల కథనం నెమ్మదిగా అనిపించే ఛాన్స్ ఉంటుంది. 

అయినప్పటికీ కామెడీ ట్రాక్, ట్విస్ట్‌లు సినిమాను ఆసక్తికరంగా తీసుకెళ్తోంది. శివాజీ, లయ తమ పాత్రల్లో సహజంగా నటించి ఆకట్టుకున్నారు. మొత్తంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఎంటర్‌టైన్ చేసే క్రైమ్ కామెడీ ఫ్యామిలీ డ్రామా.

నటీనటులు:

శివాజీ (శ్రీరామ్) సహజ నటనతో ఆకట్టుకున్నాడు. లయ (ఉత్తర) పాత్రకు న్యాయం చేసింది. రోహన్ (బిట్టు) తన కామెడీతో నవ్వులు పూయించాడు. ప్రిన్స్ (ఎస్సై విక్రమ్) నెగటివ్ షేడ్స్‌తో ఇంపాక్ట్ తీసుకొచ్చాడు. అలాగే, ఆలీ, ధన్‌రాజ్‌, శ‌ర‌త్ లోహితాస్య‌, చమ్మక్‌చంద్ర, ఇమ్మానుయేల్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

టెక్నీకల్: 

బాలు మనోజ్‌ ఎడిటింగ్‌ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ రిత్విక్‌ రెడ్డి పనితనం మెప్పిస్తుంది. కథకు కావాల్సిన కామెడీతో పాటు ఎంగేజ్ చేసే సీన్స్ రాసుకుని సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ సుధీర్‌ శ్రీరామ్‌. నిర్మాణ విలువలు సినిమాకి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి.