V6 News

Saraswathi Review: వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ రివ్యూ.. కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే?

Saraswathi Review: వరలక్ష్మి శరత్ కుమార్ ‘సరస్వతి’ రివ్యూ.. కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా ఎలా ఉందంటే?

వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌లో నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఎస్ సరస్వతి’ (S Saraswathi). తన సోదరి పూజా శరత్ కుమార్‌‌‌‌‌‌‌‌తో కలిసి వరలక్ష్మి నిర్మించింది. శుక్రవారం (2026 మార్చి 6న) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రకాష్ రాజ్, ప్రియమణి, రాధిక, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. తమన్ సంగీతం అందించాడు.

సోషల్ మెసేజ్‌‌‌‌తో పాటు ఎంగేజింగ్‌‌‌‌ క్రైమ్ డ్రామాగా వరలక్ష్మి ఈ సినిమాను తెరకెక్కించింది. నటిగా గ్లామర్ రూల్స్‌ను బ్రేక్ చేసిన వరలక్ష్మి, ఇప్పుడు దర్శకురాలిగా ఎలాంటి ఇంపాక్ట్ చూపించిందో రివ్యూలో తెలుసుకుందాం. 

ఎస్ సరస్వతి’ కథ:

లక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) ఒక సింగిల్ మదర్‌. కూతురు సరస్వతి (నివేక్ష) ఆమెకు ప్రపంచం. ఒక రోజు స్కూల్‌కి వెళ్లిన సరస్వతి కనిపించకుండా పోతుంది. తర్వాత స్కూల్‌లోనే అత్యాచారానికి గురై చనిపోయినట్లు తెలుస్తుంది.

అయితే, ఎటువంటి సాక్ష్యాలు లేక పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో, లక్ష్మి న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. లాయర్ రామానుజం (ప్రకాశ్ రాజ్) సహాయం చేసినా కేసు బలహీనమవుతుంది. చివరికి కోర్టు కేసును కొట్టేయాల్సి వస్తుంది.

ఈ క్రమంలోనే, లక్ష్మి ఓ జడ్జిని, ఐఏఎస్‌ అధికారినిని, పోలీస్‌ని హత్య చేస్తుంది. అసలు సరస్వతిపై అత్యాచారం చేసిన నిందితులు ఎవరు? లక్ష్మి ఎందుకు ఆ హత్యలు చేసింది? కేసు విచారణ క్రమంలో.. లాయర్ రామానుజానికి తెలిసిన నిజాలు ఏంటి? ఈ కథలో ప్రియమణి, కిషోర్‌, మురళి శర్మల పాత్ర ఏంటి? చివరకు సరస్వతికి న్యాయం దొరికిందా? అనేది మిగతా కథ.

విశ్లేషణ: 

సమాజంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నించే విధంగా వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ తల్లి–కూతుళ్ల బాండింగ్ చూపించగా, సెకండాఫ్ పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కోర్ట్ రూం డ్రామాగా మారుతుంది.

ALSO READ : త్రిషతో విజయ్ చెట్టాపట్టాలు..

సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను సైకలాజికల్ కోర్ట్ రూం థ్రిల్లర్‌గా చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. కథలో వచ్చే ట్విస్ట్‌లు, ముఖ్యంగా ప్రీ–ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌ సినిమాపై ఉత్కంఠను రేకేత్తిస్తోంది. పాప కేసు కోసం ప్రకాశ్‌రాజ్‌ పాత్ర రంగంలోకి దిగినప్పటి నుంచి కథలో మరింత సంఘర్షణ మొదలవుతుంది.

ALSO READ : పెళ్లి పీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్..

అయితే, కోర్టు విచారణ సీన్స్ ఇంకా బలంగా ఉంటే బాగుండేదనే ఫీలింగ్ ఇస్తోంది. ఓవరాల్గా ప్రీక్లైమాక్స్‌ ట్విస్ట్.. క్లైమాక్స్ ఘట్టం సినిమాకు ప్లస్ పాయింట్స్గా నిలిచాయి.

నటీనటులు

లక్ష్మి పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ బలమైన నటన చూపించారు. క్రిమినల్ లాయర్ పాత్రలో ప్రకాష్ రాజ్ తన అనుభవంతో పాత్రకు బలం ఇచ్చారు. ప్రియమణి, కిషోర్, మురళీ శర్మ తమ పాత్రల పరిధిలో బాగా నటించారు. చిన్నారి సరస్వతి పాత్రలో నివేక్ష ఆకట్టుకుంది.

టెక్నికల్ అంశాలు

సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగినట్లుగా ఉన్నాయి. కొన్ని సన్నివేశాలు భావోద్వేగంగా బలంగా కనిపిస్తాయి. అయితే కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా అనిపించే అవకాశం ఉంది. నటిగా, డైరెక్షర్గా వరలక్ష్మి శరత్ కుమార్కి మంచి మార్కులు పడతాయి.