Bellamkonda Sreenivas : పెళ్లి పీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. బిజినెస్ మెన్ కూతురితో నిశ్చితార్థం?

Bellamkonda Sreenivas : పెళ్లి పీటలెక్కనున్న బెల్లంకొండ శ్రీనివాస్.. బిజినెస్ మెన్ కూతురితో నిశ్చితార్థం?

టాలీవుడ్ యంగ్ హీరోస్ ఒక్కొక్కరు తమ బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇటీవల రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్  రష్మిక మందన్న వివాహ బంధంతో ఒక్కయ్యారు.  ఇక అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ తన ప్రేయసి నయనికని ఈ రోజు ( మార్చి 6న ) పెళ్లి చేసుకోబోతున్నారు.  ఇదిలా ఉండగా మరో టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడు. త్వరలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇది ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

మార్చి 8న నిశ్చితార్థం?

నిర్మాత బెల్లంకొండ సురేష్  వారసుడు శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక మార్చి 8న జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, చిత్ర పరిశ్రమలోని కొద్దిమంది మిత్రుల సమక్షంలో అత్యంత గోప్యంగా జరగనుందని సమాచారం. ఇప్పటివరకు తన వ్యక్తిగత జీవితాన్ని దూరంగా ఉంచిన శ్రీనివాస్, నిశ్చితార్థం తర్వాతే తన కాబోయే భార్య వివరాలను వెల్లడించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ప్రేమ వివాహమా? 
శ్రీనివాస్ చేసుకోబోయేది ప్రేమ వివాహమని సమచారం. ఆ అమ్మాయి గత కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసని, వారి పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పీటల వరకు వచ్చిందని టాక్. ఆమె చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని, ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని సోషల్ మీడియాలో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, బెల్లంకొండ సురేష్ కుటుంబం నుంచి దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 భారీ బడ్జెట్ సినిమా 'హైందవ'

ఒకవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణం మొదలుపెడుతూనే, మరోవైపు జయాపజాయలతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా కూడా శ్రీనివాస్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'హైందవ' (Haindava) అనే భారీ ప్రాజెక్టులో నటిస్తున్నాడు. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతోంది. హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో 'రాక్షసుడు' వంటి హిట్ అందుకున్న శ్రీనివాస్, ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

►ALSO READ | VijayTrisha: త్రిషతో విజయ్ చెట్టాపట్టాలు.. భార్యతో విడాకుల వేళ దళపతి బిహేవియర్ వైరల్!

సాయి శ్రీనివాస్ ఒక ఇంటివాడు కాబోతున్నాడనే వార్త తెలియగానే అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపిస్తున్నారు. అల్లుడు శ్రీనుతో కెరీర్ మొదలుపెట్టి, నేడు మాస్ హీరోగా ఎదిగిన శ్రీనివాస్.. ఇప్పుడు 'మనువాడబోతున్నాడు' అనే వార్త టాలీవుడ్‌లో కొత్త సందడి తెచ్చింది. మరి ఆ లక్కీ గర్ల్ ఎవరు? మార్చి 8న అధికారికంగా ఫోటోలు వస్తాయా? అన్నది వేచి చూడాలి..