చెత్త ఏరుతుండగా పేలుడు.. మణికొండలో తప్పిన ప్రమాదం

చెత్త ఏరుతుండగా పేలుడు.. మణికొండలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్ మణికొండలో  భారీ పేలుడు సంభవించింది. స్థానిక లాలమ్మ గార్డెన్లో పేలుడు సంభవించింది. చెత్త ఏరుకుంటున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఖాళీ ప్లాట్ లో ఉన్న చెత్త ఏరుకుంటుండగా...ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. భారీ శబ్దానికి స్థానికులు  భయ భ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కెమికల్ డబ్బాలు పేలినట్లు  పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో జనాలు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.