మరో కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ కు సీరమ్​ దరఖాస్తు

మరో కరోనా వ్యాక్సిన్​ ట్రయల్స్​ కు సీరమ్​ దరఖాస్తు

దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దరఖాస్తు చేసింది. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ను కొవిషీల్డ్ పేరుతో మన దేశంలో సీరమ్ మార్కెట్ చేస్తోంది. రెండు వారాల క్రితమే ఆ టీకాల పంపిణీ కూడా మొదలైంది.

లేటెస్టుగా అమెరికాకు చెందిన నోవావ్యాక్స్ అనే కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం సీరమ్ దరఖాస్తు చేసుకుంది.  బ్రిటన్ లో నిర్వహించిన మూడో దశ ట్రయల్స్ లో వ్యాక్సిన్ 89.3 శాతం వరకు సక్సెస్ అయినట్లు నోవావ్యాక్స్ ప్రకటించింది. ఆ తర్వాత ఇండియాలో వ్యాక్సిన్ ట్రయల్స్ కు దరఖాస్తు చేసినట్టు సీరమ్ సంస్థ సీఈవో అదర్ పూనావాలా ఇవాళ  తెలిపారు.

కొన్ని రోజుల క్రితమే బ్రిడ్జింగ్ ట్రయల్స్ కోసం ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేసుకున్నామని ఆయన చెప్పారు. త్వరలోనే దానికి అనుమతి వచ్చే అవకాశాలున్నాయన్నారు.