DC vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న రాజస్థాన్.. ఢిల్లీకి ఆఖరి అవకాశం

DC vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న రాజస్థాన్.. ఢిల్లీకి ఆఖరి అవకాశం

ఐపీఎల్ లో భాగంగా నేడు (మే 7) సూపర్ ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది.    ఈ మ్యాచ్ లో రాజస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ దాదాపుగా తమ ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా.. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోతుంది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆయన 10 మ్యాచ్ ల్లో 8 మ్యాచ్ లు గెలిచింది. మరోవైపు ఢిల్లీ ఆడిన 11 మ్యాచ్ ల్లో 5 మ్యాచ్ ల్లో విజయం సాధించింది. 

ఈ మ్యాచ్ లో రాజస్థాన్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వికెట్ కీపర్ ధృవ్ జురెల్, హెట్ మేయర్ స్థానంలో శివమ్ దూబే, డొనోవన్ వచ్చారు. ఢిల్లీ జట్టులో సీనియర్ ప్లేయర్ ఇషాంత్ శర్మ, గుల్బంధిం నాయబ్ ప్లేయింగ్ 11 లో చోటు దక్కించుకున్నారు.   

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, గుల్బాదిన్ నాయబ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, డోనోవన్ ఫెరీరా, రోవ్‌మన్ పావెల్, శుభమ్ దూబే, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్