కరోనా టెస్టింగ్‌ కిట్ల కొరత.. మంత్రి ఈటెలకు ఫోన్‌ చేసిన బాధితుడు

కరోనా టెస్టింగ్‌ కిట్ల కొరత.. మంత్రి ఈటెలకు ఫోన్‌ చేసిన బాధితుడు
  • తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన..
  • వ్యక్తం చేసిన షాద్‌నగర్ యువకుడు..
  •  మంత్రి ఆదేశించిన ఫలితం సున్నా

షాద్‌నగర్‌‌: కరోనా టెస్టింగ్‌ కిట్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవతున్నారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలో రోజు రోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. కాగా.. కరోనా వైద్య పరీక్షల కిట్ల కొరత ఏర్పడింది. గత ఐదు రోజులుగా కిట్ల కొరత ఏర్పడిందని, వైద్య శాఖ అధికారుల దృష్టి తీసుకెళ్లినా కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతొ షాద్‌నగర్‌‌కు చెందిన ఒక యువకుడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌‌కు ఫోన్‌ చేసి తమ బాధను చెప్పుకున్నాడు. స్పందించిన మంత్రి కిట్లు ఏర్పాటు చేస్తామని ఆ యువకుడికి హామీ ఇచ్చారు. కాగా.. ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా ఎలాంటి స్పందన లేదని ఆ యువకుడు మీడియాతో చెప్పారు. స్వయానా మంత్రి చెప్పినా కిట్లు ఏర్పాటు చేయని పరిస్థితి ఉందని వాపోయాడు. కరోనా లక్షణాలతో బాధపడుతూ నాలుగు రోజులుగా ఇబ్బందులు పడుతున్న సరైన వైద్యం దొరక్క సతమతమవుతున్నా మని, తమ ఇంట్లో చిన్నారుల పరిస్థితి కూడా ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. వైద్య శాఖ సరైన సమయంలో స్పందించకపోవడం మంత్రి చెప్పిన ఇంతవరకు ఫలితం లేదని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. షాద్‌నగర్‌‌ నియోజకవర్గ పరిధిలో ఇప్పటికి 165 కేసులు నమోదు కాగా.. 7 మంది చనిపోయారు.