ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రిప్ల్లై

ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై సీఎం రేవంత్ రిప్ల్లై

ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులపై రిప్ల్లై ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారంలో ఏప్రిల్ 29 న నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు. హైదరాబాద్ గాంధీ భవన్ కు వచ్చి మరీ నోటీసులు ఇచ్చారు పోలీసులు. మే 1 న విచారణ రావాలని నోటీసుల్లో తెలిపారు. వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు ఢిల్లీ పోలీసులు.  అయితే  ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉన్నామని.... దీనిపై 4 వారాల గడువు ఇవ్వాలని నోటీసులకు రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్. 

 కేంద్ర హోంమంత్రి వీడియోలను మార్ప్ చేసి ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. మే 1 న విచారణకు రావాలని నోటీసులు వివరించారు. సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంచార్జ్ మన్నె సతీష్. నవీన్, శివకుమార్, అస్మా తస్లీమ్ లకు నోటీసులు ఇచ్చారు. ఐతే దీనిపై  గడువు కోరింది లీగల్ టీం. ఎన్నికల ప్రచారంలో బీజీగా ఉండడంతో ఇప్పుడు విచారణకు రాలేమని వివరణ ఇచ్చారు పీసీసీ నేతలు.