మేకను ఎరగా వేసినా ... బోనులోకి చిరుత రావట్లే

 మేకను ఎరగా వేసినా ...  బోనులోకి చిరుత రావట్లే

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో చొరబడిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు ఇంకా కొనసాగుతున్నాయి.  చిరుతను బంధించేందుకు ఇప్పటికే 5 బోన్లు, 25 సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు అధికారులు. ఒకే ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు.  అన్ని ట్రాప్ కెమెరాల్లో చిరుత దృశ్యాలు చిక్కాయి. దీంతో చిరుతను పట్టుకునేందుకు  అధికారులు మేకను ఎరగా వేసినప్పటికీ చిరుత  మాత్రం బోను వరకు వచ్చి వెళ్లిపోతుంది తప్ప లోపలికి  రావడం లేదు. 

 శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ రన్ వేపై ఇటీవల చిరుత కనిపించడం కలకలం సృష్టించింది. రన్‌‌‌‌‌‌‌‌వేపై చిరుతను గమనించిన పెట్రోలింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ అధికారులు అటవీ శాఖకు సమాచారం అందించారు. చిరుత ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకునేందుకు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.కాగా, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. చిరుత సంచరిస్తుందనే విషయం తెలిసి స్థానిక గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు.